నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దాన వచనమును చదివినప్పుడు, నాకు మా బామ్మగారు జ్ఞాపకమునకు వచ్చియున్నారు. అందుకే బైబిల్ నుండి నేటి వాగ్దానముగా కీర్తనలు 139:5వ వచనము మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి యున్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు'' ప్రకారము దేవుడు మీ ముందును మిమ్మును ఆవరించియుంటాడు. అవును, ఎంతమందికి అంచులు కుట్టడము అంటే తెలుసు? అంచులు కుట్టడము అంటే, బట్టలను మడచి, ఏదైనా వ్రాయడము లేక బొమ్మ వేయడము చేస్తారు. ఆలాగుననే, నా వస్తువులన్నిటి మీద మా బామ్మగారు ఆలాగున కుట్టి, నా పేరు మొదటి అక్షరమును వ్రాయుదురు. నా చేతి రుమాలు, లేక నా టీషర్ట్‌ను చూచినప్పుడు, ఓ! ఇది నాది అని గుర్తించేదానను.

ఆలాగుననే, నా ప్రియులారా, మీ వెనుకను మరియు ముందును ఆవిధముగా ఆవరిస్తాను అని ప్రభువు అంటున్నాడు. ఆయన తన చేతిని మీ మీద ఉంచుతాడు. అనగా ప్రభువు యొక్క పేరు మీ మీద లిఖించబడుతుంది. ఆయన మిమ్మును ఆవరించి, తన పేరును మీ మీద వ్రాస్తాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 43:1వ వచనములో చూచినట్లయితే, "అయితే యాకోబూ, నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము, పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు'' అని చెప్పబడియున్న ప్రకారము అవును, ఆయన మిమ్మును పేరు పెట్టి పిలిచియున్నాడు. కనుకనే, మీరు ప్రభువునకు చెందినవారు. మీరు ఆయన సొత్తు. కాబట్టి, దిగులుచెందకండి.

నా ప్రియులారా, మీరు ఈ లోకములో ఒంటరివారై ఉండవచ్చును. మీ తల్లిదండ్రులు మిమ్మును ఒంటరిగా విడిచిపెట్టారేమో? మీ స్వంత కుటుంబ సభ్యులు వదిలివేసియున్నారేమో? అని మీరు తలంచవచ్చును. అయితే, ప్రభువు, 'నేను మీతో కూడా ఉన్నాను' అని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. 'నా ప్రియ బిడ్డలారా, మీరు భయపడకండి. మీరు నాకు చెందినవారు. మీరు నా వారు అని చెబుతున్నాడు.' అవును, మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు ప్రేమించుచున్నాడు. అందుకు మనమేమి చేయాలి? మన జీవితాలను యేసుక్రీస్తుకు పరిపూర్ణముగా సమర్పించుకుందాము. ప్రతిరోజు మన జీవితాలను నడిపించమని మనము అడుగుదాము. కలిసి ప్రార్థించుకుందాము. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరిని ప్రభువు ప్రేమించుచున్నాడు. కాబట్టి, మీరు ఆయనకు చెందినవారై ఉన్నారు. కనుకనే నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన యేసయ్యా, ఈ అద్భుతమైన వాగ్దానమునకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీ బిడ్డలుగా ఉండుట కొరకై పిలిచినందుకై నీకు వందనములు. ప్రభువా, మా పేరు పెట్టి మమ్మును పిలిచినందుకు నీకు వందనాలు. దేవా, మా జీవితములో నిరాశ చెంది, ఒంటరిగా జీవించుచున్న మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీ హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, నీ యొక్క సమాధానమును మేము అనుభవించునట్లుగా చేసి, నీ యొక్క ఆనందమును మేము పొందుకొనునట్లుగా కృపను చూపుము. దేవా, నీవు మమ్మును ఆవరించియున్నట్లుగా మేము గుర్తించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఎప్పుడు కూడా ఒంటరివారముగా భావించకుండా, నీ సమాధానమును మేము అనుభవించునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, మా వెనుక, ముందు ఆవరించి ఉన్నందుకు నీకు వందనములు. దేవా, మా మీద నీ హస్తమును ఉంచి, మమ్మును నీ సొత్తుగా మమ్మును నీ హస్తముచేత ముద్రించుము. ప్రభువా, మేము నీకు చెందినవారమని ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంపై నీ నామాన్ని వ్రాసి, నీ సన్నిధితో మమ్మును కప్పుము. దేవా, మా జీవితాన్ని నీకు హృదయపూర్వకంగా సమర్పించుకొనుచున్నాము. ప్రభువైన యేసూ, ప్రతిదినం మమ్మును నడిపించి, మాకు మార్గదర్శకత్వం వహించుము. దేవా, మేము నీకు చెందినవారమని మా జీవితం ప్రతిబింబించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.