నా ప్రియమైన స్నేహితులారా, నేడు ఒక అద్భుతమైన వాగ్దానము బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:13 వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను'' అని చెప్పబడినట్లుగానే, అవును, మనలను బలపరచు క్రీస్తు యొక్క సహాయముతో మనము సమస్తమును చేయగలుగుతాము. నా ప్రియులారా, మనము ముందు వచనము అనగా, ఫిలిప్పీయులకు 4:12లో చూచినట్లయితే, "దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి యుండుటకును ఆకలిగొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను'' అని పౌలు భక్తుడు అంటున్నాడు. అవును, ' సమృద్ధిలోను మరియు లేమిలోను నేను సంతృప్తిని కలిగియుండుటకు నాకు తెలుసు' మరియు 'అన్ని పరిస్థితులలో కూడా నేను సమృద్ధిని కలిగియుండుటకు నేను నేర్చుకున్నాను' అని అతడు అంటున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:12వ వచనములో చూచినట్లయితే, "నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను'' అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అవును, నా ప్రియులారా, ప్రతి పరిస్థితులలో కూడా ప్రభువు అన్నిటిని చేయుటకు తన సామర్థ్యమును శక్తిని మనకు అనుగ్రహించుచున్నాడు. కనుకనే, మీరు బలహీనులుగా ఉన్నారని చింతించకండి. ధైర్యముగా ఉండండి.
అందుకే బైబిల్ నుండి సామెతలు 30:8-9వ వచనములలో మనము చూచినట్లయితే, " వ్యర్థమైనవాటిని ఆబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో'' అని సొలొమోను రాజు అంటున్నాడు. సొలొమోను రాజు, ' నేను ధనవంతుడనైనను, లేక బీదగానైనను ఉండకుండా నన్ను చేయుమని అంటున్నాడు. ' ఇంకను, 'ప్రభువా, నేను ముందుకు వెళ్లడానికి కావలసిన బలమును నాకు దయచేయుము. నాకు మరి ఎక్కువగా వద్దు, ఆలాగుననే, మరి తక్కువగా కూడా నాకు వద్దు, అయితే, ఉన్న దానిలో నేను సంతృప్తిని కలిగియుండడానికి నాకు కృపను అనుగ్రహించుమని అతడు అంటున్నాడు.' నా ప్రియులారా, కొందరైతే, మరి ఎప్పుడు అన్నియు ఇంకా ఎక్కుయు కావలెననియు, మరి అత్యంత్య అధికముగా కలిగియుండాలని అత్యాశను కలిగియుంటారు. వారికి ఎంతో ఎక్కువ అది వరకే ఉండవచ్చును. అయినప్పటికిని వారిని, 'మీకేమైనా కావాలి?' అని ఒకవేళ అడిగినప్పుడు, అవును, 'నాకు ఇంకా, మరి ఎక్కువగా కావాలి' అని అంటారు. అవును, ఆలాగుననే, బైబిల్లో భక్తుడైన దావీదు కూడా ఏడుగురు భార్యలను వివాహము చేసుకున్నాడు. అయినప్పటికిని కూడా అతడు సంతృప్తి కలిగియుండలేదు. మరియొకని భార్యయైన బత్షెబకు ఉన్న అందమును చూచియున్నాడు. అతడు ఆమెతో పాపము చేసియున్నాడు. అందును బట్టి, దావీదు ఆమె యొక్క భర్తను మోస పూరితముగా హత్య చేయించియున్నాడు. తద్వారా, అతడు మరి ఎక్కువ పాపము చేసిన వ్యక్తిగా అతను మారాడు.
నా ప్రియ స్నేహితులారా, మనము కూడా ఇంకా మన జీవితములో ఇంకా ఎక్కువ కావాలి అని కొన్ని విషయాలను గురించి అత్యాశ పడుచుండవచ్చు ను. అయితే, ఈ రోజు ప్రభువును, క్షమించమని, క్షమాపణను వేడుకుంటూ ఆయనను అడగాలి, 'ప్రభువా, నా యొక్క శారీరక ఇచ్చలను తొలగించుము. నీ యొక్క ఆత్మతో నింపుము, పరిశుద్ధమైన ఆత్మతోను, సంతృప్తి కలిగినటువంటి హృదయమును నాకు ఇవ్వండి ప్రభువా,' అని ప్రార్థించండి. అవును, నా ప్రియులారా, మనుష్యునితో ఇది ఎంతమాత్రము సాధ్యపడదు. అయితే, దేవునితో అన్నియు సాధ్యమే. కనుకనే, 'శరీరముచేత నడిపించబడు మనస్సు మృతమై ఉన్నది' అని బైబిల్ గ్రంథము చెబుతుంది. నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మన మనస్సులను నియంత్రించాలని మనము ప్రార్థన చేద్దాము. అవును, శారీరకముగా మనము ఎంతమాత్రము కూడ నడుచుకొనకూడదు. ఆయన యొక్క ఆత్మచేత మనము నడిపించబడులాగున మనము దేవుని యొక్క శక్తిని కోరుకుందాము. అప్పుడు ఆయన యొక్క సంతృప్తి కలిగియున్న హృదయమును ఆయన మనకు అనుగ్రహిస్తా డు. అంతమాత్రమే కాదు, దేవుని యొక్క సహాయముతో మనము సమస్తమును చేయగలము. నా స్నేహితులారా, ఈ రోజు కూడా ప్రభువు తన ఆత్మను మనకు అనుగ్రహించి, మనలను బలపరచు క్రీస్తునందు సమస్తమును చేయగల శక్తిని ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీ పిల్లలమైన మేము నీ యొక్క ఆత్మ ద్వారా నడుచుకునేలా మాకు సహాయము చేయుము. దేవా, ఈ లోకసంబంధమైన మరియు శారీరాశ, నేత్రాశను, మరియు జీవపు డంబమును మా నుండి తొలగించుము. ప్రభువా, దురాశ మా హృదయములో ఎంతమాత్రము మేము కలిగియుండకుండా, మా మనస్సులను నీ యొక్క ఆధీనములో ఉంచుకొని, మా యొక్క ప్రతి శోధనను మా నుండి తీసివేయుము. దేవా, ఈ లోకములో ఉన్నటువంటి నేత్రాశ, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాలో నుండి తొలగించబడునట్లుగా చేయుము. యేసయ్య, మా యొక్క బలహీనతలలో నీవు మాకు సహాయము చేసి, క్రీస్తునందు మమ్మును బలపరచుము. ప్రభువా, మేము పౌలువలె అన్నిటి యందు సంతృప్తి కలిగియుండు హృదయమును మాకు దయచేయుము. దేవా, మాకు ఉన్న శోధనలన్నిటిని తొలగించుము. యేసయ్యా, మేము అపవాది నుండి వింటున్నటువంటి స్వరములను ఇక ఎంతమాత్రము మేము వినకుండా, ఇప్పుడే మా నుండి ఆ స్వరములను యేసు నామమున తొలగిపోవునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబంలోని స్త్రీ పురుషులను నీ ఆత్మ ద్వారా నడిపించి, మా గృహములలోనికి నీ యొక్క సమాధానము, ఆనందం మరియు ఐక్యతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఈ లోకసంబంధమైన వాటిని ఆశించకుండా, నీ మంచితనంతో సంతృప్తి చెందునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా చేతులు పట్టుకొని, మమ్మును నడిపించి, మేము ఎల్లప్పుడూ నీ స్వరమును వినుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, మమ్మును బలపరిచే క్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయుటకు మాకు నేర్పించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


