నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 2:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను'' ప్రకారము అవును, మరియకు అనుగ్రహింపబడిన ప్రవచనానుసారమైన వాక్కు ద్వారా కుమారుని కనెను. అవును, ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనము ప్రకారము ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చెను. అందుకే బైబిల్ నుండి యెషయా 9వ అధ్యాయంలో, మానవ అవగాహనకు అసాధ్యమైన రీతిలో ఒక కన్య కుమారుని కనును అని ముందుగానే ప్రవచించబడినది. అయినప్పటికిని, దేవుడు మీ జీవితానికి ఒక నూతన జన్మను తీసుకు వచ్చినప్పుడు, ఆయన అసాధ్యమైన దానిని సాధ్యపరుస్తాడు. ఆయనే దేవుడు. దేవుడు నిర్ణయించి, పలికినట్లుగానే, అది కన్యయైనమరియ జీవితములో నెరవేర్చబడినది. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 4:17వ వచనములో చూచినట్లయితే, "తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది'' ప్రకారము నా స్నేహితులారా, మీ జీవితములలో ఏది లేదో, వాటన్నిటిని ఆయన మీకు కలుగజేస్తాడు. ఇంకను, మీకు కొరతగా ఉన్న ఏవైనను సరే, దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీ జీవితంలోనికి తీసుకురాగలడు. మరియ జీవితంలో సమస్తాన్ని జరిగించిన అదే దేవుడు నేడు మీతో కూడా ఉన్నాడు. కనుకనే, మీరు భయపడకండి.
సహజంగా మరియ ఏ విధంగా కూడా గర్భం ధరించడం అసాధ్యం. ఎందుకంటే, ఆమె కన్య కనుకనే. కానీ, దేవుడు మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం జీవాన్ని సృష్టించి ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆయన సెలవిచ్చినట్లుగానే, 'రక్షకుడైన యేసు' అనే కుమారుడు జన్మించెను. దేవుడు చెప్పినది మీ జీవితంలో కూడా జరుగుతుంది. కనుకనే, మీ హృదయములను ఏ మాత్రము కూడా కలవరపడనీయవద్దు. నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు కూడా ఈ నూతన ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. కాబట్టి, రక్షకుడైన యేసు మీలో నేడు జన్మిస్తాడు; ఆయన మీ పాపములన్నింటిని క్షమిస్తాడు. ఈ ఆశీర్వాదం కొరకు మరియ తనను తాను దేవునికి సమర్పించుకొనెను. కనుకనే, యేసు ఆమెలో జన్మించాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మిమ్మల్ని మీరు యేసుకు సమర్పించుకున్నప్పుడు, ఆయన మీ పాపములను క్షమిస్తాడు మరియు రక్షకుడు మీలో జన్మిస్తాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 1:22,23వ వచనములో చూచినట్లయితే, "ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు ఈ రోజు మీలో జన్మిస్తాడు.
మరియు మూడవదిగా, బైబిల్ నుండి యోహాను 4:25 వ వచనములో ప్రకటించినట్లుగానే, " ఆ స్త్రీ ఆయనతోక్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.'' ఆ ప్రకారముగానే క్రీస్తనబడిన మెస్సీయ మన కొరకు జన్మించియున్నాడు. మరియు మత్తయి సువార్త 26:63 వ వచనములో చూచినట్లయితే, "అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాననెను. అందుకు యేసు- నీవన్నట్టే'' అని పలికెను. ఆయన అభిషేకించబడినవానిగాను, మెస్సీయగాను ఈ లోకములో జన్మించియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుభవించడానికి, మీలో అభిషేకించబడిన యేసు మీకు తోడుగా ఉంటాడు. బైబిల్ నుండి యెషయా 61:1 వ వచనములో చూచినట్లయితే, ఆ అభిషేకం మీ మీదికి వచ్చినప్పుడు, "ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును'' అని చెప్పబడిన ప్రకారము మీరు సువార్తను ప్రకటించడానికి, నలిగిన హృదయము గలవారిని ఓదార్చడానికి, దీనులను సంరక్షించడానికి, చెరలో ఉన్న వారికి విమోచనను ప్రకటించడానికి మరియు బంధించబడిన వారిని చీకటి నుండి విడిపించడానికి శక్తిని పొందుకుంటారు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని, ఆయన సువార్తను ప్రకటించెదరు. మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి, అభిషక్తుడైన రక్షకుని, ఇమ్మానుయేలును, అనగా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుని ఎలాగైతే కని యుండెనో, అలాగే మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నారు, కాబట్టి యేసు కూడా మీలో జన్మిస్తాడు మరియు మీతో కూడా తోడుగా ఉంటాడు. నేటి వాగ్దానము నుండి రాబోయే దినములలోను మరియు ఈ రోజు దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ యొక్క జీవముగల వాక్యము కొరకు నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, మరియలోనికి నీవు జీవం పోసినట్లుగానే, మాలోనికి కూడా నూతన జీవమును కుమ్మరించుము. ప్రభువా, మా ప్రశస్తమైన ప్రియ రక్షకుడు మరియు విమోచకుడైన యేసు మా జీవితంలో జన్మించునట్లుగా చేయుము. దేవా, మానవ హేతువుకు అతీతమైన ఆయన మహిమ మరియు అద్భుతాలను జరిగించు శక్తి మా జీవితంలో వ్యక్తపరచబడునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి మా పాపములను క్షమించి, మా హృదయంలో 'ఇమ్మానుయేలుగా' మాతో ఉండి, మమ్మును నీ యొక్క అభిషేకంతో నింపుము మరియు ఇతరులను స్వస్థపరచడానికి మరియు నీ వాక్యాన్ని ప్రకటించడానికి మరియు నీవు మేము చేయాలనుకుంటున్న విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించుము. దేవా, మా జీవితం నీ మహిమ మరియు కృపను బయలుపరచునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


