నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 60:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఇకను నీ దేశమున బలాత్కారమను మాట వినబడదు నీ సరిహద్దులలో పాడు అను మాటగాని నాశనము అను మాటగాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు'' ప్రకారం దేవుడు బలత్కారము నుండియు మరియు వినాశము నుండియు మిమ్మును దూరముగా ఉంచుచున్నాడు. మీకు రక్షణను అనుగ్రహించి, మిమ్మును భద్రపరచి, మీ ఆత్మను ప్రఖ్యాతితో నింపుచున్నాడు. మనము కలిగియున్న వరములలో అత్యంత గొప్పది రక్షణ మాత్రమే. యేసు యొక్క రక్తము మనలను పాపము నుండి కడిగి వేయుచుండగా, ఆ విధంగా మనము పొందుకొనునదియే రక్షణ. దేవుని యొక్క బిడ్డగా జీవించుటయే ప్రఖ్యాతి అనబడునదిగా ఉంటున్నది. రక్షణ కొరకు, మన భవిష్యత్తు ఆశీర్వాదము కొరకు ప్రభువునందు మనము నిరీక్షణ ఉంచుటయే ప్రఖ్యాతి అనబడుచున్నది. అవును, మనము ఏమి లేనివారిగా ఉన్నప్పుడు, వినాశనముచేతను మరియు బలాత్కారముచేత మనము ఆవరించబడియున్నప్పుడు, 'ప్రభువా, నీ యందు నిరీక్షణ ఉంచియున్నాను, నీవు వాటి గుండా నన్ను తీసుకొని వెళ్లగలవు' అని చెప్పినప్పుడు, నీ మంచితనము, నీవు నా యెదుట కనపరచుకొందువు ప్రభువా, అదియే ప్రఖ్యాతి.' శత్రువు సైన్యములన్నియు తమ మీదికి వచ్చుచున్న సమయములో యెహోషాపాతు ఆ రీతిగా ప్రభువును స్తుతించియున్నారు. అయితే, దేవుని ప్రవక్త ద్వారా,"నీవు వెళ్లుము, నీ శత్రువులను నీచేతికి అప్పగిస్తాను'' అని దేవుడు యెహోషాపాతుతో మాటలాడెను. సైన్యములను సమకూర్చి పంపించకముందే, అతడు గాయక బృందమును ముందుగానే ఆయనను స్తుతించునట్లుగా ఏర్పరచి, ఆలాగున పంపించినట్లుగా మనము చూడగలము. 'యెహోవా ఉత్తముడు ఆయన కృప నిరంతరము ఉండును' అని పాడుతూ ఉండునట్లుగా ఏర్పాటు చేశాడు. దేవుడు తానే స్వయంగా ఆ యుద్ధములో పోరాడాడు. శత్రువులు వారి మధ్యలో వారే యుద్ధము చేసుకున్నారు. ఒక్కరు కూడా కత్తిని పైకి ఎత్తకుండా, గొప్ప విజయమును దేవుడు వారికి అనుగ్రహించియున్నాడు. అదియే రక్షణ.

నా ప్రియులారా, మీ రక్షణ కోసము మీరు ఏమియు కూడా చేయవలసిన అవసరము లేదు. ఈ లోకములో ఏ చర్యయు కూడా మీకు రక్షణను అనుగ్రహించలేదు. అది ఇప్పటికి యేసు ద్వారా సిలువలో జరిగించబడియున్నది. యేసు అను ఆకృతిలో దేవుడు ఈ లోకములోనికి ఆ రీతిగా దిగివచ్చియున్నాడు. దేవునివలె ఎంతో పరిశుద్ధునిగా మరియు దేవుని యొక్క భీజముగా వచ్చియున్నాడు. ఏ నరుని యొక్క భీజము కాదు. తనను తాను బలియర్పణముగా సమర్పించుకొనియున్నాడు. అవునండి, రక్త ప్రోక్షణ లేకుండా పాపములకు క్షమాపణ కలుగదు. బైబిల్ నుండి హెబ్రీయులకు 9:22వ వచనములో చెప్పబడియున్నది. కనుకనే, మన యందరి యొక్క పాపముల యొక్క క్షమాపణ కొరకై స్వచ్ఛమైన రక్తమును చిందించబడియున్నది. అది యేసు యొక్క రక్తము. ఈ రోజున మనము చూచినట్లయితే, మనము ఆయన యందు నిరీక్షణ ఉంచి, 'ప్రభువైన యేసయ్యా, నా పాపములను క్షమించుము, నేను పశ్చాత్తాపపడుచున్నాను, నీ రక్తము ద్వారా నన్ను శుద్ధీకరించుము' అని ఆయనతో చెప్పినప్పుడు, మర్మయుక్తముగా విశ్వాసముతో ఆయన మనలను తన రక్తము చేత కడిగి శుద్ధీకరిస్తాడు. ప్రకృతికి అతీతంగా మన పాపమును మరియు పాపపు స్వభావమును తొలగించివేస్తాడు. మనము ఇక తిరిగి పాపమునకు వెళ్లము. లోకపరమైన కార్యములైతే, మీరు, పాపక్షమాపణను పొందండి. మీరు తిరిగి వెళ్లి మరల అదే రీతిగా ఆనందిస్తూ, పాపములో కొనసాగించండి అని చెప్తున్నట్లుగా ఉంటుంది. పాపమును జరిగించండి. తిరిగి మరల క్షమాపణ కోసమై రండి, అది నిజమైన రక్షణ కాదండి. యేసు మనలను శుద్ధీకరించినప్పుడు, అది నిత్యత్త్వము వరకు సంక్రమించేది. మీరు యేసును వెంబడించినప్పుడు, నీతిగల జీవితమును జీవించునట్లుగా చేస్తాడు. మీరు నీతిగల జీవితమును జీవించినప్పుడు, అదియే ప్రఖ్యాతిని తీసుకొని వస్తుంది. ఇటువంటి కృపను ప్రభువు మీకు ఈ రోజున అనుగ్రహించును గాక.

ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యము కలదు. అది పంకజ్ టోపో యొక్క అద్భుతమైన సాక్ష్యము. అతనికి యేసుతో ఎటువంటి బాంధవ్యము కూడా లేదు. అతడు ప్రభుత్వ పరీక్షల కోసము రాంచీకి రావడము జరిగినది. అతడు మరల మరల ఓటమి పాలైయ్యాడు. ఆ తర్వాత, మధ్యపానము వ్యసనమునకు వెళ్లిపోయాడు. నాలుగు సంవత్సరములు ఈ వ్యసనముతోనే ఉండిపోయాడు. ఆ తర్వాత, మూర్ఛవ్యాధి సంక్రమించినది. ఏ విధమైన గత కాలపు వైద్య చరిత్ర ఆలాగున లేదు. డాక్టర్లు అయితే, 'మీరు ఐదు సంవత్సరములు ఔషదమును వినియోగించవలసి ఉంటుంది మరియు ఒంటరిగా మీరు ఏ మాత్రము కూడా ప్రయాణము చేయకూడదు అని చెప్పారు.' అటువంటి సమయములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము రాంచీలో తెరవజేయడము జరిగియున్నది. అతని స్నేహితుడు అతనిని ప్రార్థన గోపురమునకు ఆహ్వానించాడు. ఆలాగుననే, యౌవనస్థుల సదస్సు కూడా హాజరయ్యాడు. అతడు అక్కడకు వెళ్లగానే, అతడు ఎంతో నిర్లక్ష్యముగా ఉన్నప్పటికిని, పరిశుద్ధాత్ముడు అతని ఆత్మను తన స్వాధీనములోనికి తీసుకొనియున్నాడు. మధ్యపానమును విడిచిపెట్టాడు, పాత స్నేహితులను వదిలి వేశాడు. దైవీకమైన స్నేహితులతో అనుసంధానమైయ్యాడు. బైబిల్ చదవడం ప్రారంభించాడు. అటువంటి సమయములో 2014వ సంవత్సరములో పెద్ద ప్రార్థన ఉత్సవములు నిర్వహించడానికి నేను రాంచీకి వెళ్లడము జరిగినది. అతడు అక్కడ స్వచ్ఛంద సేవకునిగా పనిచేయుచున్నాడు. అక్కడ, ఆ యొక్క సభలో మేము ప్రార్థించుచుండగా, దేవుని యొక్క స్వస్థపరచే శక్తి అతని మీదికి దిగివచ్చినది. మూర్ఛ వ్యాధి అతని విడిచి వెళ్లిపోయినది. అతడు బాగుగా ఉన్నాడని డాక్టర్లు నిర్ధారించియున్నారు. అదే సంవత్సరమున అతడు ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడై కలకత్తాలో ఉన్న రైల్వే విభాగములో ఉద్యోగమును పొందుకున్నాడు. అతడు మనీషాను వివాహము చేసుకున్నాడు. ఆమెకు కూడా ప్రభుత్వ ఉద్యోగము కలదు. వారిద్దరు కూడా యేసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పధకములో సభ్యులుగా చేర్చబడ్డారు. వెనువెంటనే, ఆరునెలలోనే ఆమె కలకత్తాకు బదిలీ చేయబడడము జరిగింది. వారికి అందమైన బిడ్డ ఆన్ జన్మించెను. ఆ బిడ్డ కూడా యౌవన భాగస్థుల పధకములో చేర్పించబడెను. వారు 8 సంవత్సరములుగా అద్దె గృహములో నివసించుచుండెను. 'దేవుని యిల్లుయైన ప్రార్థన గోపురమును నిర్మాణము చేయండి, దేవుడు మీ యింటిని నిర్మిస్తాడు' అని చెప్పబడినట్లుగానే, వారు దానిని ఆలకించి, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము నిర్మాణమునకు వారు కానుకలు సమర్పించారు. 2023వ సంవత్సరములో కలకత్తాలో దేవుడు వారికి ఒక స్వంత గృహమును అనుగ్రహించాడు. వారు ఈ రోజు స్వంత గృహములో నివాసము చేయుచున్నారు. ఎంత గొప్ప ఆనందము కదా! దేవుడు నేడు మీ జీవితమును కూడా నిర్మాణము చేస్తాడు. కనుకనే, మీ జీవితమును మీరు దేవునికి సమర్పించినట్లయితే, ఆయన మీ పట్ల బాధ్యత వహించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా ఆత్మను శుద్ధీకరించుము, మా జీవితాలలో నీ బిడ్డలు అను ప్రఖ్యాతిని మేము కలిగి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, సమస్తమును నీ కొరకు కలిగి ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితములో అద్భుతములను జరిగించుము. ప్రియమైన తండ్రీ, రక్షణ యొక్క వాగ్దానానికి మరియు యేసు రక్తం ద్వారా నీ బిడ్డగా ఉండే వరమునకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మమ్మును నాశనం నుండి రక్షించినందుకు మరియు మా హృదయాన్ని స్తుతితో నింపినందుకు నీకు వందనాలు. ప్రభువైన యేసు, మేము సిలువ కార్యమును నమ్ముచున్నాము మరియు మా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, నీ యొక్క విలువైన రక్తంతో మమ్మును శుభ్రపరచి, పాపపు ప్రతి మచ్చను మా నుండి తొలగించుము. యేసయ్యా, నీ యొక్క నామాన్ని మహిమపరిచే నీతివంతమైన జీవితాన్ని గడపడానికి మాకు కృపను దయచేయుము. దేవా, యుద్ధాలు మరియు పోరాటాలు మమ్మును చుట్టుముట్టినప్పుడు, నిన్ను స్తుతించమని మరియు నీవు అనుగ్రహించు విజయంలో నమ్మకం ఉంచమని మాకు గుర్తు చేయుము. ప్రభువా, మేము నీ యందు మా విశ్వాసాన్ని వృద్ధిపరచుకొనుటకును మరియు మా జీవితాన్ని నిర్మించుకొనుటకు మరియు మా హృదయం ఎల్లప్పుడూ దేవుడు ఉత్తముడు మరియు ఆయన కృప నిరంతరము ఉండునని అని ప్రకటించునట్లుగా మాకు అటువంటి ధన్యతను దయచేయుమని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.