నా ప్రశస్తమైన ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యము 15:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను'' అని వ్రాయబడిన ప్రకారముగా, మనము యేసుప్రభువు కృపచేత రక్షణ పొందవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. ఈ కృప మనలను మన అపరాధభావముల నుండి విడుదల చేసి, మనలను నిత్యజీవమునకు పాత్రులనుగా చేయుచున్నది. మనము కేవలము దేవుని కృపచేత మాత్రమే రక్షింపబడియున్నాము. కనుకనే, మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మనము కూడా రక్షింపబడతాము. మనము మన యొక్క మంచి కార్యముల వలన మనము రక్షణ పొందము. కానీ, అందుకే బైబిలేమంటుందో చూడండి, ఎఫెసీయులకు 2:8వ వచనములో చూచినట్లయితే, "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే'' అని చెప్పబడినట్లుగానే, 'ఇది మీ యొద్ద నుండి కలిగినది కాదు కానీ, ఇది దేవుని వరమే' అని లేఖనము సెలవిచ్చుచున్నది. మనము పొందుకొనుటకు అర్హతలేకపోయినను, ఇది దేవుడు అనుగ్రహించుచున్న ప్రశస్తమైన వరము. మనము చేయుచున్న మంచి కార్యముల వలన పరలోకమునకు వెళ్లగలుగుతామా? అని కొందరు అడుగుతుంటారు. ఒకసారి, మేము ఒక షాపింగుకు వెళ్లినప్పుడు, ఒక ప్రియ సహోదరి నా యొద్దకు వచ్చి, మంచి కార్యములను చేయడము ద్వారా మనము పరలోక రాజ్యమునకు చేరగలుగుతామా? అని ప్రశ్నించియున్నారు. ఒకవేళ, మనము మంచివారమై ఉండవచ్చును లేక మనము దయగలిగిన వారముగా ఉండవచ్చును. ఆలాగుననే, పేదవారి యెడల దయగలిగిన వారముగా ఉంటూ ఉండవచ్చును. అయితే, దేవుడు లేకుండా మనము పరలోక రాజ్యములోనికి ప్రవేశించజాలము. అందుకే బైబిల్ గ్రంథమంటున్నది కదా! ' కృప వలననే మీరు రక్షింపబడియున్నారు' అని చెప్పబడియున్నది. కనుకనే, మీరు ప్రభువునందు ఆనందించండి.
అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 15:10వ వచనములో చూచినట్లయితే, పౌలు భక్తుడు ఈలాగున అంటున్నాడు, "అయినను నేనేమైయు న్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్ర హి ంపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని'' అని చెప్పబడినట్లుగానే, దేవుని కృప వలననే మనము ఏమైయున్నామో అది అయి ఉన్నాము. అయితే, మనకు కావలసినదల్లా విశ్వాసమే. విశ్వాసము లేకుండా మనము దేవునిని చూడలేము. యేసుక్రీస్తు యందు మనము విశ్వాసము కలిగియున్నప్పుడు మనము రక్షింపబడతాము. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, "అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు '' అని వ్రాయబడినట్లుగానే, మనము యేసు ప్రభువునందు విశ్వాసముంచినప్పుడు మీరు రక్షింపబడుదురు. నేను కళాశాలలో చదువుకుంటున్నప్పుడు, నా స్నేహితురాలు, ఎప్పుడు నన్ను చూచి నవ్వుతూ ఉండేది. అదేమనగా, ' మీరు ఎప్పుడు విశ్వాసముంచాలి, నమ్మాలి' అని అంటూ ఉంటారు. కానీ, ఏమి నమ్మాలి? అని నన్ను అడిగినప్పుడు, నేను తను ప్రక్కన కూర్చుని యేసయ్య యొక్క ప్రేమను గురించి తనకు వివరించి చెప్పియున్నాను. 'యేసయ్యా, తన ప్రాణమును నీ కొరకు పెట్టియున్నాడు. నీ పాపముల కొరకై తన స్వరక్తమును చిందించియున్నాడు. నీవు యేసునందు విశ్వాసముంచిన యెడల నీవు రక్షింపబడతావు. నీవు కేవలము యేసయ్య నీ కొరకు మరణించాడని నీవు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు' అని చెప్పాను. అందుకే మనము ఎప్పుడు చెబుతుంటాము, 'మనము విశ్వసించాలి.' మీరు ఒక వ్యక్తిగా ఉంటూ, ఆయనను విశ్వసించిన యెడల మీ వలన మీ యింటివారందరు కూడా రక్షింపబడతారు. మా గృహములో మా అమ్మగారు దేవుని నమ్ముకున్నారు. తనకున్న విశ్వాసము వలన ఈ రోజు కుటుంబ సభ్యులమైన మేమందరము కూడా రక్షణలోనికి వచ్చియున్నాము. అది కేవలము దేవుని కృప వలన మాత్రమే అయి ఉంటున్నది. ఆయన నామమునందు విశ్వాసముంచిన వారందరు కూడా ఆయనను పొందుకొనెదరు. అంతమాత్రమే కాదు, దేవుని పిల్లలగుటకు వారందరికి దేవుడు అధికారమును ఇచ్చియున్నాడు. యేసుక్రీస్తు యొక్క నామమునందు మనమందరము విశ్వాసముంచినప్పుడు, ఆయన బిడ్డలముగా మనము మారగలుగుతాము. అవును, నా ప్రియ స్నేహితులారా, విశ్వాసము లేకుండా దేవునికిష్టులముగా జీవించడము అసాధ్యము.
ఒకసారి ఒక యౌవన బిడ్డల కొరకు, మేము ఒక కూడికను ఏర్పాటు చేసినప్పుడు, అవి నా పరిచర్య ప్రారంభ దినములు. ఆ కూటము చివరిగా, ప్రార్థనా సమయములో యౌవనస్థులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుచున్నారు. ఎక్కువగా పాఠశాల విద్యార్థులు ఆ కూడికలో హాజరయ్యారు. అయితే, అక్కడ ఉన్న ఒక విద్యార్థిని అక్కడ జరుగుచున్నదంతటిని చూచుచుండెను. యౌవన బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడుచుండగా, ఆ విద్యార్థిని వారందరిని చూస్తూ, నవ్వుచూ, తనలో తాను ఈ విధంగా అనుకున్నది, ' తల తెగిపోయినటువంటి కోడి అటుఇటు కొట్టుకున్నట్లుగానే, ఈ యౌవనస్థులందరు కూడా నాట్యము చేయుచున్నారు' అని తలంచుకొనుచూ, తనలో తాను నవ్వుకుంటూ ఉండెను.
అయితే, ప్రభువు తన మహా కృపను బట్టి, ఆ విద్యార్థిని కూడా తన పరిశుద్ధాత్మ శక్తితో నింపియున్నాడు. చూడండి, నా ప్రియులారా, తను కూడా ఒక కోడి వలె నాట్యము చేయడము మొదలు పెట్టినది. ఆ విద్యార్థిని పరుగెత్తుకుంటూ వేదిక మీదికి వచ్చి, ఈలాగున తన సాక్ష్యమును పంచుకున్నది, 'నా చుట్టు వారందరిని చూచి, నేను నవ్వుకుంటున్నాను, కానీ, ప్రభువు తన కృప ద్వారా ప్రశస్తమైన పరిశుద్ధాత్మ కృపావరముతో నింపియున్నాడు' అని చెప్పిి ఆ రోజు తను రక్షణ పొందుకున్నది. ఆ రోజున ప్రభువు తనను తన కుమార్తెగా మార్చివేసుకున్నాడు. తన సొంత కార్యములను బట్టి, తను రక్షణ పొందుకొనలేదు. అయితే, ప్రభువు యొక్క కృపను బట్టి, తను రక్షణ పొందుకొనినది.
నా ప్రియులారా, మన దేవుడు ఎంతో కృపగలిగిన దేవుడుగా ఉంటున్నాడు కదా. ఆయన మనుష్యులను లక్ష్యపెట్టువాడు కాదు. ఈ విద్యార్థిని వలె మనము కూడా కొన్నిసార్లు ఆయన రక్షణను నిర్లక్ష్యపెట్టినప్పటికిని, ప్రభువు తన యొక్క మహా కృపను బట్టి, మనలను రక్షణలోనికి నడిపిస్తాడు. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 2:3వ వచనములో చూచినట్లయితే, "ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగు తప్పించుకొందు ము?...'' అని సెలవియ్యబడినట్లుగానే, మనము దేవుడు ఇచ్చు రక్షణను నిర్లక్ష్యపెట్టకూడదు. కనుకనే, ఈ రోజు ఈ సందేశమును మీరు చదువుచుండగా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచండి. మీరును మరియు మీ యింటి వారందరు కూడా నిశ్చయముగా రక్షింపబడతారు. అందుకే బైబిల్‌లో, " పాపము వలన వచ్చు జీతము మరణము'' అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. అయితే, దేవుడు అనుగ్రహించు కృపావరము మనకు నిత్యజీవమును నిచ్చుచున్నది. కనుకనే, నా ప్రియులారా, మీరు దేనిని ఎన్నుకుంటారు? పాపమునా? లేక కృపనా? స్నేహితులారా, కృపనే మనము ఎన్నుకుందాము. అదియు కూడా పై నుండి వచ్చు దేవుని కృపను మనము ఎన్నుకుందాము. యేసుక్రీస్తు ద్వారా లభించే కృపను మనం ఎంచుకుందాం మరియు ఆయన ఉచితంగా అనుగ్రహించే నిత్యజీవాన్ని పొందుకుందాము. నా ప్రియులారా, ఆయన ఉచితముగా అనుగ్రహించు కృపకు మీరు పాత్రులగుటకు, మిమ్మును మీరు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు రక్షణను అనుగ్రహించి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన మా పరలోకమంద్ను ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క మహా కృపను బట్టి, నీ కృపావరమును మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మా యొక్క పాపం, చీకటి మరియు ప్రతి బంధకముల నుండి మమ్మును రక్షించి, మరియు నీ అద్భుతమైన వెలుగులోనికి మమ్మును నడిపించుము. యేసయ్యా, మేము నీ యందు మేము విశ్వాసమును ఉంచునట్లుగాను మరియు సిలువపై నీవు చేసిన పనిని నమ్మడానికి నీవు మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంలో నీ కృపను విస్తరింపజేసి, మా కుటుంబానికి రక్షణను కలిగించుము. ప్రభువా, మేమందరము రక్షింపబడునట్లుగా మాకు నీ మహా కృపను చూపుము. దేవా, నీవు మా యెడల చూపుచున్న దయ అది కృపగా ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, నీవు కనికరము కలిగిన దేవుడవు గనుకనే, నీవు మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. దేవా, నీ కృప మా మీదికి దిగివచ్చునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, మేము నిన్ను ఎన్నుకొనుటకు మాకు కృపనిమ్ము. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి, నిత్యజీవములోనికి ప్రవేశించునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యొద్ద నుండి వచ్చు కృపను ఎన్నుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేమేమైయి ఉన్నామో అది నీ కృప వలననే అయి ఉన్నామని చెప్పునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, నీ కృప ద్వారా మమ్మును మరియు మా యింటివారందరిని పాపపు లోకము నుండి మరియు మరణము నుండి తప్పించుకొను మార్గమును సృష్టించి, మమ్మును నీ యొక్క ఉచితమైన కృప ద్వారా రక్షించుము. తండ్రీ, మేము నీ యందు విశ్వాసముంచునట్లుగాను తద్వారా నీవు మాకు అనుగ్రహించు ఉచితమైన రక్షణను పొందుకొనునట్లుగా కృపను దయచేయుము. దేవా, మా మరియు మా ప్రియులగు వారి దురలవాట్ల నుండి విడిపించి, మా పాపపు క్రియల నుండి మమ్మును రక్షించుమని యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


