నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 31:6వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు'' అని చెప్పబడిన ప్రకారము మీరు దేనికిని భయపడకండి. ఎందుకంటే, ఆయన మీతో కూడా వచ్చుచున్నాడు. నా ప్రియులారా, ఇటువంటి దేవునిని మనతో కూడా కలిగియుండడము ఎంత గొప్ప ఆశీర్వాదము కదా! అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశ కాండము 31:5వ వచనములో మనము చూచినట్లయితే, " నేను మీ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి '' అని చెప్పబడిన ప్రకారము యెహోవా మీ శత్రువులను మీ చేతికి వారిని అప్పగించును అని చెబుతున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు యుద్ధమునకు వెళ్లడానికై సిద్ధపడుచుండగా, యుద్ధ భూమిలో నిలుచుచుండడానికి ప్రజలు తమను తాము సిద్ధపరచుకొనుచుండగా, దేవుడు తన ఆజ్ఞలను పాటించమని చెబుతున్నాడు, ' మీరు యుద్ధము చేయబోవుట లేదు, అయితే, మీ పక్షమున యుద్ధము చేయడానికి, నేను మీకు తోడుగా ఉన్నాను '' అని ప్రభువు వారికి సెలవిచ్చియున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి, ఆయన మీకు తోడుగా వచ్చి, మీ పక్షమున యుద్ధము చేస్తాడు.
నా ప్రియులారా, దేవుడు మనతో కూడా రావడము ఎంత అద్భుతమైన విషయము కదా! ప్రభువు ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపిడుస్తూ ఉన్నప్పుడు, ఆయన వ్యక్తిగతంగా వారితో కూడా నడిచాడు. వారికి కావలసినవన్నియు కూడా ఆయనే వారికి సమకూర్చియున్నాడు. అంతమాత్రమే కాదు, వారి పక్షమున ఉండి, ఆయన ఏ విధముగా యుద్ధము చేశాడు అని మనము చూడగలము. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 118:6వ వచనములో చూచినట్లయితే, " యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు?'' అని చెప్పబడినట్లుగానే, ' మీరు కూడా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు ఎవరు విరోధముగా ఎవరు ఉండగలరు?' అని ఈ వాక్యమును చెబుతూ ఉండండి. అందుకే బైబిల్ నుండి దావీదు భక్తుడు కీర్తనలు 23:4,5వ వచనములలో మనము చూచినట్లయితే, " గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును'' అని చెప్పబడిన ప్రకారము అతడు ఈ విధంగా దావీదు ప్రభువును స్తుతించియున్నాడు. చూడండి, నా ప్రియ స్నేహితులారా, ఇది ఎంత గొప్ప అద్భుతమైన అనుభవము కదా! అవును, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు, మనము బలముగాను, ధైర్యముగా ఉండగలుగుతాము. ఇంకను మనము సింహము వలె ఎంతో ధైర్యముగా ఉండగలుగుతాము.
నా ప్రియులారా, అపవాది మనకు విరోధముగా రావచ్చును, నేడు ప్రజలు మనకు విరోధముగా రావచ్చును. అయితే, మీరు వారికి విరోధముగా పోరాడుట లేదు, గానీ, అందుకు బదులుగా ప్రభువే మీ యుద్ధములను మీ పక్షమున చేయబోవుచున్నాడు. ఆయన వారికి విరోధముగా పోరాడుతాడు. యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని విజయమును, రక్షణయెహోవా వలననే కలుగుతుంది అని చెప్పబడియున్నది. ఇంకను మనము బైబిల్ గ్రంథమును చూచినప్పుడు, ప్రభువు వారి పక్షమున యుద్ధము చేసెను అని అనేక చోట్ల మనము చదువగలుగుతాము. ఇశ్రాయేలీయులు దేవుని యందు విశ్వాసముంచి ఆలాగున ముందుకు సాగారు. అందుకే పై వచనములో, 'నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు ' అని వ్రాయబడియున్నది. మేము కుటుంబముగా కొన్ని కష్టములను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు, ప్రభువు ఒక ప్రవచన వాక్యము ద్వారా మాతో మాట్లాడియున్నాడు. ఆ వచనము, 'మీరు చింతించకండి, బాధపడకండి, నా బిడ్డలారా, నేను మీకు తోడుగా ఉన్నాను, నా మహిమ మీ మీద ఉన్నది, మీరు ఓపికతో, ప్రార్థన యందు కనిపెట్టండి, మీరు నోరు తెరవకండి, మీరు మౌనముగాను, ఊరకుండండి, నేనే మీ యుద్ధములన్నిటిని కూడా పోరాడుతాను. ప్రభువు ఈ వాక్యములన్నియు మా కుటుంబ సభ్యులకు వాగ్దానముగా ఇచ్చియున్నాడు. ప్రభువు యొద్ద నుండి ఈ మాటలను విన్న తర్వాత, ప్రభువు యొద్ద నుండి ఒక నూతన బలము మాలోనికి దిగివచ్చినట్లుగా మేము అనుభూతి చెందియున్నాము. మేము ఆనాటి నుండి ఇంక ఎప్పుడు కూడా ఏడ్వలేదు. అయితే, మేము దేవుని సన్నిధానములో సంతోషించియున్నాము. ఆ సమయములో మా మానవరాలైన క్యేటీ చాలా చిన్నది. ఆ వాక్కు మా మధ్యకు వచ్చినప్పుడు తను చాలా సంతోషముతో గంతులు వేసినది. తాను నవ్వుతూ, ఆనందముతో అనేక విషయములను మాడ్లాడుచుండెను. తను ఇంకను సరిగ్గా మాట్లాడలేదు. కానీ, పరిశుద్ధాత్మ శక్తి తన మీదికి దిగివచ్చినట్లుగా మేము భావించియున్నాము. తనను చూచినప్పుడు, మేము కూడా నూతన బలమును పొందుకున్నట్లుగా అనుభూతి చెందాము. అదేవిధముగా, ప్రభువు మిమ్మును కూడా బలపరుస్తాడు. బలపరచబడండి, ధైర్యముగా ఉండండి, నా ప్రియ స్నేహితులారా, యుద్ధమును ధైర్యముగా ఎదుర్కొనండి, ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు. మీరు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధములలోను మీకు నిశ్చయముగా విజయము కలుగజేస్తాడు. ఇంకను నేటి వాగ్దానము నుండి దేవుడు మీ పక్షమున పోరాడి మీకు విజయమును అనుగ్రహించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మాకు తోడుగా ఉంటావని వాగ్దానము చేసినట్లుగానే, ఇశ్రాయేలీయులకు నేను తోడుగా ఉన్న రీతిగా మీతో కూడా నేను తోడుగా ఉంటాను అని చెప్పినట్లుగానే దేవా, నీ యొక్క వ్యక్తిగతమైన తాకిడిని మేము అనుభూతి చెందునట్లుగా మాకు కృపను దయచేయుము. ప్రభువా,మా కష్ట సమయములలో మమ్మును బలపరచుము, మమ్మును ధైర్యపరచుము. దేవా, మేము సింహమువలె గర్జించునట్లుగా, మమ్మును నీ యొక్క బలముతో నింపుము. ప్రభువా, నీ బిడ్డలైన మేము ఎప్పుడు అణగద్రొక్కబడకూడదు. దేవా, ప్రజలు మాకు విరోధముగా యుద్ధము చేసినను, సరే, మాకు విరోధముగా వారు విజయము పొందకుండా, నీవు మాకు విజయమును చేకూర్చుము. దేవా, మా పట్ల న్యాయమును జరిగించి, మేము వేచియున్న కాలమునకు బదులుగా, మా కోర్టుకేసును, ఇంకను మా కార్యములన్నిటిలూను మాకు విజయమును అనుగ్రహించుము. ప్రియమైన ప్రభువా, మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలోనూ మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మాలో భయం పెరిగినప్పుడు, దయచేసి నీవు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నావని మాకు జ్ఞాపకము చేయుము. ప్రభువా, మా హృదయాన్ని బలపరచుము మరియు ధైర్యపరచుము. దేవా, నీకు విధేయత చూపడానికి మరియు నీ యందు నమ్మకం ఉంచడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా యుద్ధాలతో పోరాడుచూ, నీ యొక్క మహిమతో మమ్మును కప్పుము. దేవా, ఈ రోజు భయంకంటే నీ మీద విశ్వాసం ఉంచాలని మేము ఎంచుకొనియున్నాము. ప్రభువా, మాలో ఉన్న పిరికితనముగల ఆత్మను తొలగించి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మాకు దయచేయుము. మా పక్షమున యుద్ధములో పోరాడుము. ఏ అపవాది నీకు విరోధముగా విజయము నొందకుండా చేయుము. దేవా,నీవు మాకు తోడుగా నిలిచి, విజయము వెంబడి విజయము మీకు దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


