నా ప్రియమైన స్నేహితులారా, దేవునితో గడిపే మరొక సంతోషకరమైన దినము ఇది. ప్రతిరోజు, ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి మనలను నడిపించుట ద్వారా ప్రత్యక్షపరచబడుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 97:11వ వచనమును మనము చూచినట్లయితే, మనం ఒక విజయవంతమైన నూతన ఆశీర్వాదాన్ని పొందుకొనబోవుచున్నాము. ఆ వచనము, "నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడియున్నవి'' అని చెప్పబడిన ప్రకారము ఇది సాధారణమైన ఒక వెలుగు కాదు. ఇది సాధారణమైన ఒక ఆనందం కాదు. ఇది క్రీస్తు యొక్క వెలుగైయున్నది. ఇది యెహోవా యందలి ఆనందమై యున్నది. ఇది నీతిమంతుల మీదికి దిగివస్తుంది. అది నీతిమంతుల మీదికి, ప్రభువు యెదుట యథార్థంగా ఉండాలనుకునే వారి మీదికి వస్తుంది. ఇది నీతిమంతులపైకి, ప్రభువు యెదుట యథార్థంగా జీవించాలనుకునే వారి మీదికి ఈ వెలుగు దిగి వస్తుంది. ఈ ఆనందం ఏమైయున్నది? ఇది మన హృదయాలలో దేవుని యందలి బలమై యున్నది. నీతిమంతుల హృదయంలో యెహోవా యందలి ఆనందం వలన మహా బలం, సమృద్ధిగా కలుగుతుంది.
నా ప్రియులారా, మన నిమిత్తమైన ఈ వెలుగు దేవుని యెదుట సాక్ష్యార్థమై యున్నది. ఆలాగుననే, ప్రజలందరి యెదుట సాక్ష్యార్థముగా నిలిచియున్నది. మరియు ఇది మన యొక్క నీతిని గూర్చిన సాక్ష్యము మరియు దేవునితో ఉన్న మన ఏకత్వాన్ని ప్రకటించే సాక్ష్యము ఇది. వీరు, దేవుని పరిచారకులు అని స్పష్టముగా తెలియజేయబడుతుంది. ఇంకను ఇతడు దేవుని సేవకుడు. ఈమె దేవుని సేవకురాలు, ఈమె దేవునికి చెందిన స్త్రీ. మీరు భక్తులైన దానియేలు, యోసేపు, పౌలు మరియు సీలల యొక్క జీవితాలలో జరిగిన గొప్ప కార్యాలను మనము చూడవచ్చును. దేవుని యొక్క గొప్ప శక్తి ద్వారా భూమి కంపించి, బ్రద్ధలైనప్పుడు, చెరసాల తెరవబడినప్పుడు, చెరసాల నాయకుడు పౌలు మరియు సీలల యెదుట సాగిలపడి, మీరు నిజముగా దేవుని ప్రజలని సాక్ష్యమిచ్చి, నేను కూడా మీలాగే ఎలా రక్షింపబడగలను? అని అడిగాడు. అదేవిధముగా, యోసేపు జీవిత చరిత్రలో చూచినట్లయితే, యోసేపు కూడా చెరసాలలో ఉన్నప్పుడు, పానదాయకుని కలను వివరించినప్పుడు, అతను దేవుని బిడ్డగాను మరియు దేవునికి చెందినవాడని గుర్తించబడ్డాడు. ఆలాగుననే, దానియేలు గుహలోని సింహాలను జయించినప్పుడు, రాజు తానే స్వయంగా దానియేలు యొద్దకు వచ్చి, 'నిజంగా, దానియేలూ, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును ' అని చెప్పాడు.
నా ప్రియులారా, వారి హృదయాలలో దేవుని యందలి ఆనందము నిండిపోయినది. ఆ ఆనందము చెరసాలలో కూడా వారిని కాపాడినటువంటి ఆనందం. అవినీతి ద్వారా వారు చెరసాలలో వేయబడినప్పటికిని, వారు దేవుని యందలి నమ్మకంతో, విశ్వాసంతోను, నీతిని కాపాడుకుంటూ, యథార్థముగా జీవించారు. తద్వారా, వారు నీతిగాను మరియు దేవుని బిడ్డలుగా యెంచబడ్డారు. మరియు యెహోవా యొక్క వెలుగు వారి మీదికి దిగి వచ్చినది. కనుకనే, ఆ యొక్క వెలుగు ద్వారా వారు నిజమైన దేవుని పరిచారకులని సాక్ష్యమును పొందుకున్నారు. అవును, నా ప్రియులారా, దేవుడు నీతిమంతులకు ఇచ్చు రెండు ఆశీర్వాదాలు ఇవి. కాబట్టి చింతించకండి, దేవుడు మీ హృదయాలలో దేవుని యందు భయమును మీకు అనుగ్రహించుచున్నాడు. కనుకనే, దేనిని గురించి భయపడకండి, దేవుని యెదుట మరియు మానవుల యెదుట ఎల్లప్పుడు నీతి కలిగిన జీవితాన్ని జీవించండి. దేవుడు అలాంటి హృదయాన్ని నీతితోను మరియు వెలుగుతోను నింపుతాడు. కనుకనే, మీరు ఇప్పుడే దానిని పొందుకొనుటకు మీ హృదయాలను దేవునికి అప్పగించినట్లయితే, నిశ్చయముగా, దేవుని యందలి ఆనందమును మరియు ఆయన యొక్క నీతిని మీకు అనుగ్రహించి, మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ నీతిని మాలో కుమ్మరించు ము. దేవా, మేము నీ సన్నిధిలో నీతిగా జీవించాలనే కోరికను మాలో నింపు ము. ప్రభువా, నీ నీతితో మమ్మును నిత్యము పోషించుము. యేసయ్య, నీ పరిశుద్ధతతో మమ్మును పోషించుము. దేవా, మా తలంపులు పవిత్రములైనవిగా ఉండునట్లుగాను మరియు మా కోరికలు పవిత్రంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా హృదయం నీ యెదుట స్థిరంగా నిలిచి ఉండునట్లుగాను, మేము నీ యొక్క హృదయానుసారులుగా జీవించుటకును మరియు నీకు నిజమైన పరిచారకులనుగా ఉంటూ నీకు సాక్షికరముగా జీవించే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మా జీవితం నీ కృపకు సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి మమ్మును నీ సన్నిధితో నింపుము మరియు రాజుల యెదుట మరియు మా చుట్టు ఉన్న వారందరి యెదుట మా సాక్ష్యాన్ని ప్రత్యక్షరచబడునట్లుగా మమ్మును నడిపించుము. యేసయ్యా, తద్వారా వారు మాలో ఉన్న నీ యొక్క వెలుగును చూసి, నిజంగా, వీరు దేవుని పరిచారకులని చెప్పగలుగునట్లుగా చేయుము. దేవా, మా యొక్క అవినీతి సమయాలలో కూడా నీ యందలి ఆనందం మాలో ఉండునట్లుగా చేయుము. ప్రభువా, అది మా నీతిని కాపాడుటకును మరియు మమ్మును యథార్థంగా జీవించునట్లుగా చేయుము. దేవా, నీ మహా శక్తి ద్వారా మాత్రమే మేము నీతిమంతులము కాగలము. కనుకనే ప్రభువా, నేడు నీ యందలి ఆనందం మా బలముగాను, మా గానము మరియు నా నిరీక్షణాస్పదముగా ఉండునట్లుగాను, ఆలాగున మేము నీ యందు నమ్మకము కలిగి జీవించుటకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అమూలమైన నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


