నా ప్రియ స్నేసితులారా, ఈ రోజు మీరు మీ జీవితములో ఎన్నో పోరాటముల ద్వారా ఇబ్బంది పడుచున్నారా? మీ జీవితములో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా ఒక పోరాటములాగా అనిపించుచున్నాయా? మీ కుటుంబ జీవితము ఒక కష్టముగా అనిపించుచున్నదా? మీరు మీ బిడ్డలను చూసుకోవడము ఒక పోరాటము వలె మీకు ఉండవచ్చును. మీ ఉద్యోగ జీవితములో కూడా మీకు పోరాటములు ఉండియుండవచ్చును. అన్నిటిని మీరే స్వంతంగా చూచుకోవాలని అనుకుంటున్నారా? అలసిపోయినట్లుగా శ్రమపడుచున్నట్లుగా భావించుచున్నారా? అయితే, ఈ రోజు ప్రభువు అంటున్నాడు కదా, "ఈ యుద్ధము నీదే కాదు, యుద్ధము నాది కూడా.'' అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 20:15వ వచనమును మనము చదువుదాము. ఆ వచనము, "...మీరు భయపడకుడి, జడియకుడి, యా యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును'' అని చెప్పబడినట్లుగానే, మీరు భయపడకండి, ఈ రోజు మీ యుద్ధములన్నిటిని దేవుడే మీ పక్షమున ఉండి జరిగిస్తాడు.

ఒకానొక సమయములో నా జీవితములో అన్ని పనులను నా మీద వేసుకొని చేస్తుంటాను. జేడెన్ జన్మించినటువంటి సమయములో ఆ విధంగా ఉండేదానను, 'ప్రభువా, నేను నా కళాశాలకు వెళ్లాలి, నా డిగ్రీని పూర్తి చేసుకోవాలి, జేడెన్ మరియు క్యేటీని చూసుకోవాలి ' అని ఇలా అన్ని పనుల భారములను నేను నా మీదనే వేసుకొనేదానను. అనేకమంది ప్రజలు నన్ను చూచి, ' మీరు ఎందుకు చింతించుచూ కనబడుచున్నారు అని అడిగేవారు.'

అయితే, ఒక రాత్రి ప్రభువు నాతో ఇలాగున అన్నాడు కదా, " నీ పనుల భారములన్నిటిని నా మీద వేయుము. సమస్తమును నా హస్తములలోనికి విడిచిపెట్టుము,'' అని చెప్పాడు. ఆలాగుననే, రాత్రి అందరు నిద్రించిన తర్వాత, నేను ప్రార్థించుకుంటున్నప్పుడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును'' అని ప్రభువు నాతో మాట్లాడాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, అటువంటి విశ్రాంతిని మీకివ్వడానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. అన్ని పనులను మీ మీదనే భారముగా వేసుకొనకండి. మీ భారములను ఆయన మీద వేయండి, ఆయన ఇచ్చు విశ్రాంతిని అనుభవించండి.

మా కుటుంబములో చూచినట్లయితే, మా కుక్క పిల్లయైనటువంటి కాఫీ కూడా మా దగ్గరకు వచ్చి, మా ప్రక్కన కూర్చుంటుంది. మేము తనతో కూడా నేల మీద కూర్చున్నప్పుడు, అది, 'హా!' అని చెప్పి, ఎంతో హాయిగా భావిస్తుంది. మా అమ్మ నా ప్రక్కనే ఉన్నారు, తను నాకు కావలసినవన్నియు చూచుకుంటుంది అని భావిస్తుంది. నా ప్రియులారా, ఈ రోజు మీరందరు కూడా అటువంటి హాయి భావమును లేక విశ్రాంతిని పొందండి. మీ జీవితములో సమస్తమును ప్రభువే చూచుకుంటాడు అని మీరు గుర్తుంచుకొనండి. ఇది మీ యుద్ధము కాదు, ఇది ప్రభువుదే. కనుకనే, నా స్నేహితులారా, మీ జీవితములో మీరు దేనిని గురించి చింతించనవసరము లేదు. ప్రభువే అన్నింటిని చూచుకుంటాడు. ఈ రోజు షన్నిటిని సమస్తమును ప్రభువు హస్తములకు సమర్పించుకుని కలిసి మనము ప్రార్థన చేద్దాము. అవును, నా ప్రియ స్నేహితులారా, మీరు సమస్తమును ప్రభువు హస్తములకు సమర్పించి, ఆయన మీకు శ్రేష్టమైన ఫలితములను అనుగ్రహిస్తాడు. అవును, నా ప్రియులారా, ప్రభువు ఈ రోజు తన విశ్రాంతిని మనకు ఇస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రభువు తన సమాధానముతో మిమ్మును ఎల్లప్పుడు నింపును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, ఈ రోజు అన్నిటిని నీ హస్తములకు మేము సమర్పించుచున్నాము. షవును, ప్రభువా, ఈరోజు నుండి మేము దేనిని గురించి చింతించవలెనని కోరుకొనడము లేదు. దేవా, మేము ఇక నుండి ఎటువంటి సందేహములలో ఉండకూడదు. ప్రభువా, మా జీవితములను నీ హస్తములకు సమర్పించుకొనుచున్నాము. ఎందుకనగా, ప్రభువా, ఇది మేము చేయుచున్న యుద్ధము కాదు, యుద్ధము నీదై ఉన్నది. ఈ రోజు మేము మా ఫలితముల కొరకు ఎదురు చూచుచున్నాము. కనుకనే,ఇది మా యుద్ధములలో నీవే మాకు జయమును అనుగ్రహించుము. దేవా, ఇది మా యుద్ధము కాదు గానీ, నీవే మా పట్ల యుద్ధము జరిగించుచున్నావని మేము నమ్మునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, శేష్టమైన ఆశీర్వాదములను నీవు మాకు దయచేసి, మమ్మును దీవించుము. దేవా, మేము అడుగువాటన్నిటికంటె అత్యధికముగా నీవు మాకు అనుగ్రహించుము. యేసయ్యా, ప్రయాసపడి భారము మోయుచున్న మమ్మును నీ యొక్క విశ్రాంతితో నింపుము. దేవా, నీ యొక్క సమాధానమును మరియు సంతోషమును మేము కలిగియుండునట్లుగా మాకు నీ కృపను దయచేయుమయేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.