నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మీకందరికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 రాజులు 13:23వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "గాని యెహోవా వారి మీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టక యుండెను'' అని చెప్పబడినట్లుగానే, యెహోవా మీద మీద జాలిపడి మీ యందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ఆయన చేసియున్న నిబంధననుబట్టి మీయందు లక్ష్యము నిలిపియున్నాడు. ఎంత గొప్ప దేవునిని మనము కలిగియున్నాము కదా! ఆయన మన యెడల జాలి చూపెడుతూ, తన దయను ఉంచియున్నాడు. ప్రభువు ఎప్పుడు మన పట్ల దయ చూపెడతాడు? ప్రభువు ఎప్పుడు మన యెడల కనికరిస్తాడు? అని మనము బైబిల్ నుండి యెషయా 30:18వ వచనములో చూచినట్లయితే, "కావున మీయందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయు చున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు ధన్యులు '' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ యెడల దయ చూపవలెనని యెహోవా మన పట్ల ఆలస్యము చేయుచున్నాడు.
నా ప్రియ స్నేహితులారా, మనము ఏమి చేయాలి? మనము ప్రతి విషయము కొరకు ప్రభువు పాద సన్నిధిలో కనిపెట్టుకొని ఉండవలెను. మన జీవితములో మనకు కావలసిన పెద్ద విషయమైన లేక చిన్న విషయమైన సరే, ప్రభువు పాదాల చెంత కనిపెట్టుకొని ఉండవలెను. మన జీవితములో మనకు కావలసిన పెద్ద విషయమైన లేక చిన్న విషయమైనా ప్రభువు పాదాల చెంత కనిపెట్టుకొని ఉండాలి. ఎంతగా వీలైతే, అంతగా దేవుని వాక్యమును చదవండి. ఇంకను ప్రభువు పాద సన్నిధిలో వేచియుండండి. అప్పుడు మీరు ఈ విధంగా దీవించబడతారు. ప్రభువు యొక్క కృప మీ మీదికి దిగివస్తుంది. మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నిటిని ప్రభువు క్షమించి మరచిపోతాడు. దేవుడు మిమ్మును కరుణింపవలెనని మీ కొరకు నిలువబడియున్నాడు. కనుకనే, ఆయన మిమ్మును దీవెనకరమైన విధానములో నడిపిస్తాడు.
అందుకే బైబిల్ నుండి యెషయా 31:5 వ వచనములో చూచినట్లయితే, " పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచు నుండును దానికి హానిచేయక తప్పించుచునుండును'' అని చెప్పబడినట్లుగానే, పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు దేవుడు మిమ్మును కాపాడి, అపవాది మీకు హానిచేయకుండా మిమ్మును తప్పించును. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు పాదాల చెంత కనిపెట్టు అలవాటును కలిగియుండండి. అప్పుడు ప్రభువు మిమ్మును కాపాడుతాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు మరియు భద్రపరుస్తాడు.
అలాగుననే, బైబిల్ నుండి హోషేయ 14:3వ వచనములో చూచినట్లయితే, "...తండ్రిలేని వారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా'' అని చెప్పబడినట్లుగానే, అనగా ప్రభువు చెంతమాత్రమే తండ్రిలేనివారికి కనికరము దొరుకుతుంది. నా ప్రియులారా, ఒకవేళ, ఈలోకములో మీ యొక్క తండ్రి, తల్లిని, మీ ప్రియులను కోల్పోయి ఉంటారేమో? అయితే, మీరు చింతించకండి. యేసయ్యా యొక్క కనికరము మీ మీద ఉన్నట్లయితే, అన్నిటికంటె అది ఎక్కువగా ఉంటుంది. మీరు ఒంటరిగా, ఎవరూ లేనివారిగా భావించవచ్చును, కానీ నిరుత్సాహపడకండి. యేసు చూపించు కనికరము ఏ మానవ ప్రేమ లేదా ఈ లోక బంధంకంటే గొప్పది. కనుకనే, ఆయన మిమ్మును ఎన్నడూ విడువడు, ఎడబాయడు. గాయపడిన ప్రతి హృదయానికి ఆయన యొక్క దయ చాలును.
నా ప్రియులారా, ఇప్పుడు కూడా మిమ్మును మీరు తగ్గించుకొని, ఆయన పాదాల చెంత వేచియున్నప్పుడు, ఆయన కనికరము మీ జీవితము మీద నిలిచి ఉండునట్లుగా ఆయన సన్నిధిలో మొఱ్ఱపెడదాము. అప్పుడు ఆయన దయ మీ మీద ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది. మీరు ఆయన దయ కొరకు ఎదురుచూచుండగా, ఆయన కృపాకనికరము, కాపుదల మరియు శాశ్వతమైన ప్రేమ అనుదినము మిమ్మును కప్పుతుంది. నేటి వాగ్దానము ద్వారా ఆయన దయ చేత మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ యొక్క గొప్ప ప్రేమకై నీకు వందనములు. దేవా, మేము నీ యొద్దకు వచ్చినప్పుడు, ఎంతో గొప్ప కృపను దయను కనికరమును చూపు దేవుడు. యేసయ్యా, మా యొక్క తప్పిదములన్నిటిని క్షమించుము. దేవా, నీ యొక్క కృప మరియు దయచూపుము. ప్రభువా, నీ యొక్క పాదాల చెంత నీకు మొఱ్ఱపెట్టుచున్న మా మీద నీ యొక్క దయను కనుపరచుము. యేసయ్యా, నీలో గుప్తములై ఉన్న ఆశీర్వాదములన్నిటితో మమ్మును నింపుము. దేవా, నీ పాద సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని యుండుటకు, నీ వాక్యమును ధ్యానించుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము ప్రతిరోజు నీ వాక్యమును ధ్యానించుచున్నప్పుడు, మా హృదయమును విశ్వాసంతో నింపుము. దేవా, మా లోపములన్నిటిని క్షమించి, నీ కనికరముతో మమ్మును పవిత్రపరచుము. ప్రభువా, మా యొక్క ప్రతి కీడు మరియు హాని నుండి మమ్మును కాపాడి, విడిపించి, రక్షించుము. దేవా, ఒంటరిగా, కృంగిపోయి, లేదా విడువబడిన స్థితిలో ఉన్న మమ్మును నీ ప్రేమచేత మరియు కనికరముతో నింపి, మమ్మును ఓదార్చి, నీ తండ్రి ప్రేమను మేము అనుభవించునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును నీకు అతి సమీపముగా చేర్చుకొని, నీ కృపతో మా కుటుంబమును ఆవరించి, మా జీవితంలోని ప్రతి అడుగులో నీ కనికరముతో నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


