నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును బాగు చేయవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన మీకు స్వస్థతా శక్తిని మీలోనికి పంపించి, రోగము నుండి మీకు విడుదలను అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. అందునిమిత్తము మనము దేవునికి ప్రార్థించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన ఇప్పుడే మీ స్వస్థత కొరకైన మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించబోవుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యాకోబు 5:15వ వచనమును మన కొరకు తీసుకొనబడినది. ఆ వచనము, "విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును'' ప్రకారము మనము స్వస్థపరచబడు నిమిత్తము మనకు దేవుడు విశ్వాసమును అనుగ్రహించుచున్నాడు. కనుకనే, దేవుని యందు మనము విశ్వాసము కలిగియుండాలి. మనము దేనియందు విశ్వాసమును కలిగియుండాలి? మొదటిగా బైబిల్ గ్రంథము ఏమి చెబుతుందనగా? దేవుని యొక్క వాక్కునందలి విశ్వాసమును కలిగియుండాలి. అందుకే బైబిల్ నుండి యోహాను 15:7వ వచనములో యేసు ఏమని చెప్పబడియున్నదని చూడండి, " నా యందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును'' ప్రకారము మీరు దేవుని యందు నిలిచియున్నప్పుడు మీలో ఎటువంటి కోరికను కలిగియున్నను సరే, మీరు దానిని అడగండి, నిశ్చయముగా అది మీకు అనుగ్రహించబడును. దేవుని యొక్క వాక్కు మీలో నిలిచియున్న యెడల, అట్టి దేవుని యొక్క వాక్కును మీరు స్వతంత్రించుకొని, ఏదైతే అడుగుతారో, దానిని మీరు పొందుకుంటారు. మా తాతయ్యగారు వేకువనే నాలుగు గంటలకు లేచి, పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ఉండేవారు. ఆయన లైట్‌లు వెలిగించరు. ఆ రోజులలో బల్లమీద పెట్టుకునే లైట్లు లేవు. ఆయన దగ్గర టార్చ్ లైట్స్ ఉండేవి. ఆ టార్చ్ లైట్స్‌తో తన బైబిల్ మీద వెలుగును ప్రసరింపజేసుకొని, వాక్యమును చదివేవారు. ఆలాగుననే, ప్రతి వచనమును క్రమము తప్పకుండా ఆ విధంగా చదువుచుండేవారు. 'నేనే మార్గమును' అన్నట్టుగా ఉండియున్న యేసు యొక్క మాటలను చదివినప్పుడు, ఆయన, ఈలాగున చెబుతుండేవారు, 'ప్రభువా, నీవే నాకు మార్గమై యున్నావు. నీవే నా కుమారుడైన దినకరన్‌కు మార్గమై యున్నావు. నా కోడలు స్టెల్లాకు నీవే మార్గమై యున్నావు, చిన్నవాడైన నా యొక్క మనవడైన పాల్‌కు నీవే మార్గము అంటూ, మాలో ప్రతి ఒక్కరి కొరకు ప్రతి దినము, ఆయన యొక్క వాక్యమును స్వతంత్రించుకొనేవారు. అదియుగాక, 'ప్రభువా, ఈలాగున జరిగించుము అని అడిగేవారు. 'ప్రభువా, నీవే మార్గముగా ఉన్నావని నీవు వాగ్దానము చేసియున్నావు,' అని చెప్పి, ఆయన లేఖనములను స్వంతము చేసుకొని, ఆ లేఖనములను స్వతంత్రించుకొనేవారు. నేను నమ్ముచున్నాను, మా తాతయ్యగారి ద్వారా మా కొరకు స్వతంత్రించుకొనబడి ఉన్నటువంటి లేఖన భాగములన్నిటిని బట్టియు కూడా మేము ఇప్పుడు ఆశీర్వదింపబడియున్నామని నమ్ముచున్నాను. ఆలాగుననే, దేవుని యొక్క వాక్యమును చేపట్టుకొని, స్వతంత్రించుకొని ప్రార్థించండి, ప్రభువు మీ ప్రార్థనలకు జవాబిస్తాడు, మిమ్మును స్వస్థపరుస్తాడు.

రెండవదిగా, ఆయన నామమునందలి విశ్వాసము, మీకు స్వస్థతను తీసుకొని వస్తుంది. అందుకే బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 3:16వ వచనములో చూచినట్లయితే, " ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగి యున్న వీనిని బలపరచెను; ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను'' అని చెప్పబడిన ప్రకారము యేసు నామమునందలి విశ్వాసము ద్వారా ఈ యొక్క కుంటివాడు స్వస్థపరచబడియున్నాడు. అవును, యోహాను 14:13,14వ వచనములలో చూచినట్లయితే, " మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అని యేసు చెప్పబడినట్లుగానే, ఆయన నామమున మీరు దేనినైనను అడగండి. యేసు యొక్క నామము, అనగా, రక్షకుడు అని భావము. మీరు యేసు నామములో అడిగియున్నప్పుడు, ప్రభువైన యేసును మీరు ఏది అడిగినను, ఆయన తానే స్వయంగా వచ్చి, దానిని జరిగిస్తాడు. మీరు యేసు నామములో ప్రార్థనచేయుచూ, ఆయనను అడిగియున్నప్పుడు, ప్రభువే స్వయంగా దిగివస్తాడు. అవునండి, యేసు నామము అద్భుతమైనది, శక్తివంతమైనది, మహిమవంతమైయున్న నామము. కనుకనే, యేసు నామమును స్వతంత్రించుకొనండి. యేసు నామమున ప్రతి మోకాలు వంగుతుంది, దయ్యములు పారిపోతాయి, రోగులు స్వస్థపరచబడతారు, ఇంకను ప్రజల యొక్క పాపములు క్షమించబడతాయి. ఎందుచేత? మనము దేవుని యొద్ద నుండి ప్రతి ఆశీర్వాదము స్వీకరించబడు నిమిత్తము, యేసు మన నిమిత్తమై బలియాగమై యున్నాడు. యేసు నామమును గూర్చి దేవునికి జ్ఞాపకము చేయండి. చెప్పండి, 'యేసయ్య, నాకు అవసరమైన ఈ ఆశీర్వాదము కొరకు తనను తాను త్యాగముగా చేసుకొనియున్నాడు. కనుకనే, సర్వశక్తిమంతుడవైన ప్రభువా, ఈలాగున నీవు యేసు నామమున మాకు జరిగించుము' అని చెప్పండి. మీరు ఆలాగున ప్రార్థించినప్పుడు, యేసు వచ్చి, మీరు దేని నిమిత్తము అడుగుచున్నారో, దానిని ఆయన మీ కొరకై జరిగించును. కనుకనే, మీ హృదయమును కలవరపడనీయ్యకండి.

మూడవదిగా, యేసు గాయముల యందు, ఆయన పొందిన దెబ్బల యందు విశ్వాసముంచండి. అందుకే బైబిల్ నుండి యెషయా 53:5వ వచనములో మనము చూచినట్లయితే, "మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము ఆయన పొందియున్న గాయములచేత అనగా, యేసు పొందియున్న దెబ్బలచేత మీరు స్వస్థపరచబడుచున్నారు. ఆయన సిలువలో బాధపరచబడిన గాయములు, మీకు శాంతిని అనుగ్రహించడానికి, మీ యతిక్రమములన్నిటిని తొలగించడానికి ఆయన గాయములను పొందియున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 8:17లో చూచినట్లయితే, "ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయా ద్వార చెప్పబడినది నెరవేరెను'' అని చెప్పబడిన ప్రకారము మిమ్మును స్వస్థపరచునిమిత్తము, మీ యొక్క బలహీనతలను తొలగించువేయునిమిత్తము, యేసు బలియర్పణమై యున్నాడు. ఈ రోజు కూడా ఆయన సజీవుడు. మూడవదినమున తిరిగి లేచియున్నాడు. గాయములన్నియు, గాయములకు సంబంధించిన గురుతులన్నియు కూడా ఇంకను ఆయన దేహము మీద నిలిచియున్నవి. దానియందు విశ్వాసముంచండి. ఈలాగున మీరు చెప్పండి, 'ప్రభువా, ఈ రోజున కూడ నీవు పొందిన గాయములు సజీవముగా ఉన్నాయి, నేను స్వస్థపరచబడు నిమిత్తము నీవు గాయముల గుండా వెళ్లియున్నావు' అని చెప్పినప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి, ఆయన గాయముల ద్వారా మిమ్మును స్వస్థపరుస్తాడు. ఆయన దేహమునందు పొందియున్న దెబ్బల వలన ఆయన మిమ్మును స్వస్థపరుచును. మీ హృదయమును, మీ వివాహమును, మీ వ్యాపారములో ఉన్న నష్టములను కూడా స్వస్థపరచును. సమస్తమును కూడా నూతనపరచబడతాయి. మీరు రెండింతలుగా కలిగి ఉంటారు. చివరిగా, మీకు పునరుత్థానమును కలిగించుట కొరకు మీరు ఆయన ఆత్మ యందు విశ్వాసముంచండి. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:11వ వచనములో చూచినట్లయితే, "మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును'' ప్రకారము యేసు యొక్క ఆత్మ మిమ్మును మృత్యువు నుండి మిమ్మును తిరిగి మరల లేపుతుంది. ఎందుకనగా, యేసును మృతి నుండి తిరిగి లేపిన పునరుత్థానపు శక్తిని ఆయన కలిగియున్నాడు. ఒకవేళ, మీ ఆత్మ ఒకవేళ మృతమైయున్నట్టుగా ఉండివచ్చును, మీ వ్యాపారము మృతమైయున్నట్టుగా ఉండివచ్చును, మీ కుటుంబ జీవితము చనిపోయినట్టుగా ఉండివచ్చును, ఒకవేళ, మీ ఆత్మ చనిపోయినట్టుగా ఉండి ఉండవచ్చును. ఒకవేళ మీరు ఆర్థికంగా చచ్చిపోయినట్లుగా ఉండవచ్చును, యేసు యొక్క ఆత్మ మీకు పునరుత్థానమును కలిగించునని మీరు విశ్వసించండి. ఆయన ఇప్పుడే యేసు నామమున మిమ్మును నింపనివ్వండి. మిమ్మును మరియు మీకు సంబంధించిన సమస్తమును కూడా ఆయనే స్వయంగా పునరుత్థానమును చెందించనివ్వండి. పైకి లేవండి, పైకి లేవండి, దేవుని యొద్ద నుండి మీ దేహములోను, మీ కుటుంబములోను, మీ జీవితములో సమస్తమును తిరిగి వచ్చి, మిమ్మును లేవనెత్తును గాక. ఇంకను మరొక సంగతి, ఏమనగా, మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై యున్నారు అనెడి విశ్వాసము. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 6:19వ వచనములో చూచినట్లయితే, "మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు'' అని చెప్పబడిన ప్రకారము మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నది. కనుకనే, మీ దేహములో పునరుత్థానము అనేది ఉంటుంది. మీ హృదయమును కలవరపడనీయకండి. చిట్టచివరిగా, మీలో ఉన్నవాడు, లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు అనెడి విశ్వాసమును మీరు కలిగియుండండి. అందుకే బైబిల్ నుండి 1 యోహాను 4:4 వ చనములో చూచినట్లయితే, "చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు'' అని చెప్పబడిన ప్రకారము ఏ అపవాది కూడా మీ జీవితమును అధిగమించలేదు. కనుకనే, మీరు విశ్వాసమును కలిగియుండండి. వీటన్నిటిలోను కూడా మీరు ప్రార్థన చేయండి. యేసు యొక్క స్వస్థతా శక్తి మీలోనికి వస్తుంది. ఏ అపవాది రోగమును మీలో నుంచి ఆలాగుననే ఉంచలేదు. కనుకనే, మీరు స్వస్థపరచబడండి, విడుదల పొందండి. మీ ఆత్మను మరియు మనస్సును అణచివేతకు గురిచేస్తున్న దురాత్మను యేసు నామమున విడిచిపొమ్మని ఆజ్ఞాపించుచున్నాను, మీకు ఇప్పుడే స్వాతంత్య్రమును విడుదల కలుగును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మీకు స్వస్థత నిచ్చి, మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
కృపాకనికరములు కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసు, నీ వాక్కును, నీ శక్తివంతమైన నామమును నమ్మి మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీవు మమ్మును స్వస్థపరచువాడవు మరియు మమ్మును పునరుద్ధరించువాడవు. గనుకనే, నీ గాయముల ద్వారా, మా శరీరమును, మా హృదయమును, మాలో విరిగిపోయిన ప్రతిదానిని స్వస్థపరచుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మా జీవితంలోని ప్రతి మృత ప్రాంతాన్ని తిరిగి జీవముతో లేపుము. దేవా, మా జీవితంలో నీ జీవమునిచ్చు వాగ్దానములను మేము జ్ఞాపకము చెప్పుకుంటూ, ఈ రోజు నీ వాక్యము యందు నిలిచియుండునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, దయచేసి మా యతిక్రమములను, మా పాపములను తొలగించి, మమ్మును నీ శాంతి సమాధానముతో నింపుము. దేవా, మా శరీరంలోని ప్రతి బలహీనతను, వ్యాధిని విడిచిపెట్టి వెళ్లిపోవునట్లుగాను మరియు నీ బలాన్ని మాలొ పునరుద్ధరించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఇప్పుడు మా విమోచనను పొందుకొని, నీలో స్వతంత్రగా జీవించునట్లుగా మాకు నీ కృపనిమ్ముమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.