నా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క జీవం ఈ రోజు కూడా మీలోనికి ప్రవహించుచున్నది మరియు మనము కూడా ఆ యొక్క దేవుని జీవంతో కూడా పయనించబోవుచున్నాము. ఆ జీవము యేసు నుండి వచ్చిన జీవపు మాటల ద్వారా కలుగుచున్నది. ఆ మాటలను మనం బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:5వ వచనములో వాగ్దానముగా చూడబోవుచున్నాము: "దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక'' అని చెప్పబడిన ప్రకారము ఈ రోజు మీలోనికి ప్రవహించే దేవుని ప్రేమ ద్వారా, ఆయన మీ జీవిత ప్రయాణంలో మీరు నిలకడగాను మరియు స్థిరంగా కొనసాగడానికి మీకు సహాయం చేయబోవుచున్నాడు. అది క్రీస్తు యొక్క పట్టుదల అని చెప్పబడియున్నది. సిలువ వైపు తన ప్రయాణంలో యేసు ఎంతగా సహించాడో మనకు తెలిసియున్నది. తాను మరణం గుండా వెళ్లాలని ఆయనకు గుర్తెరిగినప్పటికిని, మానవ రూపం దాల్చి, తన ఇష్ట ప్రకారము, తానే స్వయంగా మరణము ఎదుర్కోవడం అంత సులభం కాదు. అయినప్పటికిని, ఆ మరణ యాత్ర అంతయు ఆయన ఎంతో సహనముతో మౌనముగా సహించి, తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. నా ప్రియులారా, ఆ ఓర్పు మరియు సహనం మనలోనికి కూడా నేడు రాబోవుచున్నది. అందుకే, యేసు మన కోసమే బలిగా మార్చబడి, తన ప్రాణమును మన కొరకు అర్పించాడు.

కనుకనే, నా ప్రియులారా, ఇప్పుడు మనం కూడా దీనిని ప్రభువు కొరకు చేయబోవుచున్నాము. యేసుక్రీస్తు తన్నుతాను తగ్గించుకొని, సిలువను మోసినట్లుగానే, నేడు మనం కూడా ఆయన నిమిత్తం దీనిని చేయబోవుచున్నాము. కానీ, ఈ రోజు కూడా, మీ వ్యాపారంలో మీరు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉండవచ్చును. మీ ఉద్యోగంలో లేదా పనిలో, మీరు ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉండవచ్చును. మీ చదువులో, మీరు కొన్నిసార్లు ఓటమిని ఎదుర్కోవలసి ఉండవచ్చును మరియు అవన్నియు మీకు ఎంతో వేదనకరంగా ఉండి ఉండవచ్చును. వీటన్నిటి మధ్యలో మనము ఓర్పు కలిగియుండాలి. అప్పుడు, ఈ ఓర్పు ద్వారా మనలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది మరియు మనలను మరల తలను పైకెత్తుకొనునట్లుగా చేసి, 'మేము దీనిని మరల కొనసాగించబోవుచున్నాము' అని ధైర్యముతో చెప్పునట్లుగా చేయును. నా ప్రియులారా, ఇటువంటి దీన స్థితిలో, దేవుడు మనలను తిరిగి పైకి లేవనెత్తి, ఉన్నతముగా ఎదుగుతూ ముందుకు సాగిపోవునట్లుగా చేయబోవుచున్నాడు. కనుకనే, నిరాశ చెందకుండా, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, ఈ విధేయత, పరాజయమూ నిండిన మార్గం, మనలను తగ్గించుటకు కాదు; మనము దీనత్వమును కలిగి ఉండడానికిని మరియు మన జీవితములో మనకు పాఠాలు నేర్పించడానికి మాత్రమే అని భావించి, ధైర్యముగా ముందుకు సాగండి. అవును, ప్రియులారా, ఇది నిజంగా ఓటమి కాదు, ఇది దేవుడు మనలను విజయానికి తీసుకెళ్లు మార్గం అని ప్రభువును స్తుతించండి. ఆయన మనము నేర్చుకోవాలని, ఆయనకు విధేయులుగా మార్చబడాలని, మరింత రూపాంతపరచబడాలి మన పట్ల కోరుకుంటు న్నాడు, తద్వారా దేవుని మహత్తరమైన ఉన్నత స్థాయికి మనం లేవనెత్తబడ గలుగుతాము. కనుకనే, నా ప్రియులారా, ఈ విజయ మార్గంలో, దేవుడు మీకు సహనాన్ని అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, మీరు ఈ పరుగు పందెంలో ముందుకు కొనసాగుటకును, ఆయనకు విధేయులుగా ఓర్పుతో నడుచుటకును, ఆయనను అనుసరించుటకును మరియు ఎన్నడు కూడా మీ చేతులు విడువకుండా ఉండుటకు మీకు మార్గము ఏర్పరచుచున్నాడు. ఆలాగుననే, ఒకసారి ఒక ఫుట్‌బాల్ మేనేజర్, 38 మ్యాచ్‌ల సీజన్ ముగిసిన తర్వాత, మా జట్టు ఒక మ్యాచ్ ఓడిపోవడం మంచిదే. లేకపోతే మేము సంపూర్ణులమని భావించే అవకాశం ఉండేది అని అన్నారు. ఆ ఓటమి ద్వారా వారు సరిదిద్దుకోవలసిన విషయాలను వారికి తెలియజేసింది. దాని ఫలితంగా వారు మరింత బలంగా మార్చబడి, చివరకు ఛాంపియన్‌షిప్‌ను సాధించారు. అదే విధంగా, నా ప్రియులారా, దేవుడు మనకు సహనం నేర్పుతూ, మనలను ఉన్నతమునకు ఎదుగనట్లుగా చేసి, ప్రతి పరిస్థితిలోనూ లేచి నిలబడే శక్తిని అనుగ్రహించుచున్నాడు. ఇంకను, దేవుడు మనము పట్టుదలతో ఉండడానికి, ఎదగడానికి మరియు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నేర్పించుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల ప్రభువా, దయచేసి నేను ఓపికగా ఉండటానికి సహాయం చేయుము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి ఓటమిని భరించడానికి మాకు సహనమును నేర్పించుము. ప్రభువా, మేము చేయు ప్రయాణంలో పట్టుదలతో మరియు కొనసాగడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నిన్ను విడువకుండా, ఎటువంటి స్థితిలోను మేము నిరాశను చెందకుండా మాకు నీ యొక్క బలమును అనుగ్రహించుము. ప్రభువా, మేము మేము ఇక నుండి బాధపడకుండా, ఏడ్వకుండా ఉండునట్లుగా మమ్మును ప్రభువా, ఇది మాకు ముగింపు కాదు, ఇది నీవు బోధించే క్షణం, నేర్చుకునే క్షణం, దీనత్వమును నేర్చుకునే ప్రాముఖ్యమైన క్షణం మాత్రమే. దేవా, మేము నిన్ను విశ్వసించి, నీకు విధేయత చూపాలని ఎంచుకున్నందుకై నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, దయచేసి మా బలహీనత క్షణంలో మమ్మును నీ యొక్క శక్తి ద్వారా బలపరచుము మరియు మాలో నీ కృపను పరిపూర్ణం చేయుము, తద్వారా మేము లేచి ప్రకాశించునట్లుగాను, ఉన్నత స్థాయికి మరల లేవనెత్తబడుటకు మాకు నీ కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.