నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేడు ఒక అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి 2 తిమోతికి 4:18వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్'' అని చెప్పబడినట్లుగానే, మనలను దుష్కార్యము నుండి తప్పించాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఇది దేవుని వాగ్దానమై ఉంటున్నది. ఆలాగుననే, ప్రతి కీడు నుండి బయటకు తప్పించగల శక్తి దేవునికి కలదు. అంతమాత్రమే కాదు, ఈ లోకమంతయు కీడుతో నిండియున్నది. అపవాది మన జీవితములను నశింపజేయాలని చూచుచున్నాడు. కనుకనే, దేవునితో అన్యోన్యసహవాసమును మనము ఎలా కలిగియుంటాము? అందుకే బైబిల్ నుండి సామెతలు 19:23వ వచనమును చూచినట్లయితే,"యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవసాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును'' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగియుండుట వలన అది మీకు జీవసాధనముగా ఉంటుంది. మీరు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటూ, ఆయన మార్గములో నడిచినట్లయితే, నిశ్చయముగా, మీరు కీడు నుండి కాపాడబడుదురు.

నా ప్రియ స్నేహితులారా, మీరు సాతానుని యొక్క చెడు మార్గములలో నడుస్తున్నారా? దేవుని యొక్క మంచి మార్గములలో మీరు నడుస్తున్నారా? అయితే, అందుకే బైబిల్ నుండి లూకా 10:19వ వచనములో చూచినట్లయితే, "ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీకెంత మాత్రమును హానిచేయదు'' అని చెప్పబడినట్లుగానే, మీరు తండ్రియైన దేవునిని గట్టిగా పట్టుకొనియున్నట్లయితే, మీ కొరకు తన ప్రాణమును సిలువలో అర్పించిన ఆ యేసయ్యను విడిచిపెట్టకుండా గట్టిగా హత్తుకొని ఉండవలెను. అపవాది హస్తముల నుండి ఆయనే మిమ్మును రక్షించాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

అందుకే బైబిల్ నుండి 2 థెస్సలొనీకయులకు 3:3వ వచనములో చూచినట్లయితే, "అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' అని చెప్పబడినట్లుగానే, మన దేవుడు మిమ్మును కాపాడుటకు నమ్మదగినవాడుగా ఉన్నాడు. ఇంకను బైబిల్ నుండి యిర్మీయా 29:11వ వచనములో చూచినట్లయితే, "నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, దేవునికి మీ పట్ల ఒక ఉద్దేశము కలదు. అది సమాధానకరమైనవిగా ఉంటున్నవి. గనుకనే, నా ప్రియులారా, మీరు చేయవలసిన కార్యమేదనగా, మీరు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు, మీరు సమాధానమును సంతోషమును కలిగియుంటారు. ఇట్టి ఆశీర్వాదమును మీరు ఇప్పుడే పొందుకొనండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా పట్ల నీవు సిద్ధపరచిన దీవెనలను బట్టి, నీకు వందనములు. యేసయ్యా, నీవు మా కొరకై చేసినటువంటి త్యాగమును బట్టి నీకు వందనములు. ప్రభువా, మా యొక్క ప్రతి దుష్కార్యము నుండి మమ్మును రక్షించుము. యేసయ్యా, మేము నీకు సమీపముగా వచ్చునట్లుగాను, నిన్ను మేము మా స్వంత రక్షకునిగా అంగీకరించునట్లుగాను మాకు నీకు కృపను అనుగ్రహించుము. ప్రభువా, మేము శత్రువు మార్గములను కాకుండా, నీ యొక్క మార్గములను అనుసరించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి చెడు వ్యసనము నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, నీ యొక్క సంతోషమును సమాధానమును కలిగియుండునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మేము నిన్ను గట్టిగా హత్తుకొని ఉండునట్లుగాను, మమ్మును సమస్త దుష్టత్వము నుండి కాపాడుము. ప్రభువా, మేము పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీవు మాకు అధికారము అనుగ్రహించుము. దేవా, ఏదియు కూడా మాకు ఎంతమాత్రమును హానిచేయకుండా నీ హస్తములలో మమ్మును భద్రపరచుకొని, కాపాడుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.