నా ప్రియులారా, ఈ రోజున కూడా, ప్రేమకు మరియు సమాధానానికి ఆధారమైన దేవుడు. మన కృపామయుడైన ప్రభువైన యేసు మీతో ఉంటాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 కొరింథీయులకు 13:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనములలో ఉన్న వాగ్దానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ వచనము, "...ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన ప్రేమకు మరియు సమాధానమునకు కర్త మన దేవుడు. బహుశా! మీరు, 'నాలో ప్రేమ లేదు! నా పట్ల ప్రేమ చూపించేవారు ఎవరూ లేరు!' అని అంటుండవచ్చును. లేదా, నేను ఎంతో ప్రేమను చూపించుచున్నాను, కానీ, తిరిగి నా పట్ల ప్రేమ చూపించువారు ఎవరూ లేరు!' అని మీరు అనుకుంటుండ వచ్చును. ఇతరుల పట్ల నేను చూపే ప్రేమను ఎవరూ గుర్తించడం లేదు అని భావించుచున్న మీతో ప్రభువు ఇలాగున అంటున్నాడు, " మీరు ఇంకను పాపులుగా ఉండగానే, నేను మిమ్మును ప్రేమించి, మీ కొరకు నా ప్రాణమును అర్పించియున్నాను'' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, అటువంటి ప్రేమను ఆయన మీరు అనుభవించునట్లుగా చేస్తాడు.
నా ప్రియులారా, మీలో ఉన్న లోపముల మధ్య కూడా, ఒకవేళ, 'నాలో లోపాలు ఉన్నవి, నన్ను ఎవరు ప్రేమిస్తారు?' అని మీరు అనుకున్నప్పుడు, ఆయన ప్రేమ మీ పరిపూర్ణతపై ఆధారపడి ఉండదని గుర్తుంచుకోండి. ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ ఈ రోజే మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన తన ప్రేమపూర్వకమైన చేతులతో మిమ్మును పిలిచి, చిన్న పిల్లలను కౌగిలించుకున్నట్లుగానే, ఆయన తన రొమ్మునకు మిమ్మును హత్తుకుని, కౌగిలించుకుని, మిమ్మును ఆశీర్వదిస్తాడు. యేసు యొక్క దృష్టిలో మీరు కూడా ఒక చిన్న బిడ్డలే. ఆయన మీ విషయంలోనూ అలాగే చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 5:8లో ఈ విషయం ఎంతో అద్భుతంగా ధృవీకరించబడింది: "అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను'' అని చెప్పబడినట్లుగానే, మన కొరకు ఆయన చేసిన త్యాగము ద్వారా ఆయన ప్రేమ వెల్లడిపరచబడియున్నది. కనుకనే, ఈ రోజు ఆయన కృప మిమ్మును కడిగి పవిత్రపరచును గాక, అలాగే మీ లోపములన్నిటి నుండి మిమ్మును విడిపించును గాక.
నా ప్రియులారా, ఈ త్యాగపూరితమైన ప్రేమ, బైబిల్‌లో యోహాను 15:13వ వచనములో మరి ఎక్కువగా స్పష్టంగా వెల్లడిపరచబడినది: " తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు'' అని చెప్పబడినట్లుగానే, యేసు ఈ ప్రేమను మన పట్ల తానే కనుపరచియున్నాడు మరియు మనలను తన స్నేహితులుగా పిలుచుచున్నాడు. ఆయన, 'నీవు నాకు అత్యంత ప్రియమైన స్నేహితులు '' అని పిలుచుచున్నాడు. ఎందుకనగా, స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు. ఆలాగుననే, 'నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.' కాబట్టి, ఆయన ప్రేమ మిమ్మును ఆదుకొని, మీ శ్రమల నుండి విడుదలను కలుగజేయుచున్నది. మీరు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, మీ హృదయములో కలవపడనీయ్యకండి. అందుకే బైబిల్ నుండి హెబ్రీయులకు 4:16వ వచనములో చూచినట్లయితే, " గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని యొద్ద నుండి సహాయము పొందుట కొరకు ఆయన కృపాసనమునొద్దకు ధైర్యముగా చేరగలము. కాబట్టి, మీకు అవసరమైన సమయములో సహాయమును పొందుటకు కృపను, కనికరమును పొందడానికి మీరు ధైర్యముగా కృపాసనం దగ్గరకు వెళ్లి, మీ సమస్యలను ప్రభువు సన్నిధిలో ఉంచి, ఆయన సహాయమును కోరుకున్నట్లయితే, ఆయన మీ పట్ల తన కనికరమును చూపి, మీకు కావలసిన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన మీ యొక్క పరిస్థితులలో సమాధానమును కలుగజేసి, మీ చుట్టూ ఉన్నవారితో సామరస్యంగా జీవించడానికి మీకు సహాయము చేస్తాడు.
కనుకనే, నా ప్రియులారా, ధైర్యంగా ఉండండి. అధికారము మరియు భీకరత్వమును దేవునికి చెందినవనియు, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానమును కలుగజేయుచున్నాడని మనకు బైబిల్ నుండి యోబు 25:2 వ వచనమును మనకు గుర్తు చేయుచున్నది. ఆ వచనము, "అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగజేయును'' అని చెప్పబడినట్లుగానే, మీ జీవితములోని ప్రతి పరిస్థితిలోనూ తన సమాధానమును మీకు కలుగజేయగల అధికారము ఆయనకు కలదు. కాబట్టి, ఈ రోజు మీరు ఏ భారమును మోయుచున్నను, సరే, దానిని ఆయన సన్నిధికి తీసుకురండి. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:6-7వ వచనములలో చూచినట్లయితే, "దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును'' అని చెప్పబడినట్లుగానే, మనము ప్రార్థన మరియు కృతజ్ఞతాపూర్వక హృదయంతో మన విన్నపాలను దేవునికి తెలియజేసినప్పుడు, సమస్త జ్ఞానానికి మించిన ఆయన సమాధానము మన హృదయాలను మరియు మనస్సులను కాపాడుతుంది. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ఆయన సమాధానము మీ హృదయాన్ని నింపనివ్వండి. ఆయన సమాధానము మీ మీదికి వచ్చినప్పుడు సాతాను మీ కాళ్లక్రింద నాశనము చేయబడుతుంది. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 16:20వ వచనములో చూచినట్లయితే, " సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక'' అని చెప్పబడినట్లుగానే, ఆయన సాతానును మీ పాదాల కింద చిత్తుక త్రొక్కిస్తాడని వాగ్దానము చేయబడినది. కనుకనే, ఈ రోజు, యేసు నామములో, సాతాను మరియు అపవాది యొక్క అనుచరుల కార్యాలన్నీ మీ పాదాల కింద చిత్తుక త్రొక్కించిబడుచున్నవి. ఈ రోజు, యేసు నామములో సాతాను మరియు వాని అనుచరుల కార్యాలన్నీ మీ పాదాల కింద అణచివేయబడుచున్నవి. మీరు విడుదల పొందినవారుగా ఉంటారు. ప్రభువు మిమ్మును తన ప్రేమతో మరియు సమాధానముతో నింపాలని, మీరు మేలులను అనుభవించి శుభవార్తను పొందునట్లుగా చేయాలని, అలాగే ఆయనను తిరిగి ప్రేమించి మీ జీవితాన్ని పూర్తిగా ఆయన చేతులకు అప్పగించే కృపను మీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువైన యేసయ్య, నీ శాశ్వతమైన ప్రేమచేత, పరిపూర్ణ శాంతితో మా హృదయాన్ని నింపుము. దేవా, మా బలహీనతలలో, లోపాలలో కూడా నీ కృపను అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీవు మమ్మును కౌగిలించుకొని, బలపరచి, ప్రతి కష్టం నుండి మమ్మును ఈ రోజు విడిపించుము. దేవా, మా జీవితంలోని ప్రతి పరిస్థితిపై నీ శాంతి ఆధిపత్యము చేయునట్లుగా చేయుము. ప్రభువా, శత్రువు యొక్క ప్రతి కార్యమును మా పాదముల క్రింద అణచివేసి, మాకు స్వాతంత్య్రమును దయచేయుము. దేవా, నీ ప్రేమ మమ్మును నింపి, నిన్ను ప్రేమించునట్లుగా మా జీవితమును సంపూర్ణముగా నీ చేతులకు అప్పగించుటకు మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంలోకి ప్రేమ, గుర్తింపు, శ్రేయస్సు, సమృద్ధి, పునరుద్ధరణ మరియు క్షేమాన్ని పొందుకునే కృపను మాకు దయచేయుమము. ప్రభువా, మేము కోల్పోయిన సమస్తమును తిరిగి మాకు అనుగ్రహించి, మా కుటుంబమును మరియు మా పనిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


