నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 యోహాను 4:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "... మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నా రు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని సన్నిధి ద్వారా మనము శక్తిమంతులముగా ఉండబోవుచున్నాము. పౖౖె చెప్పబడిన వాక్యభాగము మనలో ఉన్నటువంటి దేవుని శక్తిని తెలియజేయుచున్నది. నా ప్రియులారా, మీలో ఉన్నవాడు దేవుని పరిశుద్ధాత్మయై ఉంటున్నాడు. ఈ లోకమునందు పాపము కలిగియున్నటువంటి మనుష్యులు మరియు దుష్టులు ఉంటారు. అయితే, యేసుక్రీస్తునకు వ్యతిరేకముగా ఉన్నటువంటివారు సాతానుకు సంబంధించినవారుగాను, దుష్టులుగా ఎంచబడుచున్నారు. అందుకే బైబిల్ నుండి యోహాను 8:44వ వచనమును చూచినట్లయితే, "మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు '' అని వాక్యము చెప్పబడినట్లుగానే, అపవాది అబద్ధమునకు తండ్రియై యున్నాడు. అయితే, మరొకవైపు యేసు ప్రభువు ఈలాగున అంటున్నాడు, "యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు'' అని సెలవిచ్చిన ప్రకారముగానే, ఆయనే సత్యమై ఉంటున్నాడు. కాబట్టి, మనము కూడా సత్యము అనుసరించి నడుచుకొనవలెను. సాతాను ఈ లోకమునకు అధికారిగా ఉంటున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 12:31వ వచనములో చూచినట్లయితే, "ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును'' అని చెప్పబడినట్లుగానే సాతాను ఈ లోకాధికారిగా పిలువబడుచున్నాడు. అయితే, దేవునికంటె ఎక్కువ శక్తిమంతుడు అపవాది ఎన్నటికిని కానేరడు. దేవుని యొక్క ఆత్మ మరియు ఆయన యొక్క జ్ఞానము, అపవాది యొక్క యుక్తిలన్నిటికంటె శక్తివంతమైనది. కనుకనే, భయపడకండి.
నా ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, ఈ లోకములో జరుగుచున్నవాటన్నిటిని గురించిన వివేచన మనకు లభించుచున్నది. తద్వారా, మనము అన్నిటిని అర్థము చేసుకొనగలము. దేవుని ఆత్మ మనలను జీవింపజేయుచున్నది. ఇంకను సంపూర్ణముగా మనము జీవించునట్లుగా చేయుచున్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, దేవుని జ్ఞానమైనటువంటి పరిశుద్ధాత్మతో మనలను నింపమని మనము వేడుకొనవలెను. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుని జ్ఞానములో ఎదిగాడు. అందును బట్టి, ఆయన శారీరకముగా వయస్సులో కూడా ఎదిగాడు. దేవుని కృపలోను మరియు మనుష్యుల దయలో ఆయన ఎదిగాడు. అవును, నా ప్రియులారా, ప్రభువు మనలను అందరిని కూడా యేసయ్య వలె ఈ లోకములో సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాకుండా, ప్రభువు, మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు. అవును, ఆయన మనకు ధైర్యముగల ఆత్మను ఇచ్చియున్నాడు. నా ప్రియులారా, ఆ శక్తి మనకు స్వంతమైనది కాదు గానీ, అది పరిశుద్ధాత్మ దేవునిదిగా ఉంటున్నది. ఆలాగుననే, మనలను బలపరచు క్రీస్తునందు మనము సమస్తమును చేయగలుగుతాము.
నా ప్రియులారా, యౌవనస్థులు తమ జీవితములో పైకి ఎదగడానికి ఎంతగానో శ్రమపడుతుంటారు. ఒకవేళ, వారు ఓటమి పాలైనట్లయితే, దాని అంగీకరించలేకుండా, ఎంతగానో బాధపడుతుంటారు. వారు జీవితములో ఒకవేళ ఓడిపోయినట్లయితే, ఆ వైఫల్యమును అంగీకరించలేకుండా శ్రమనొందుతారు. వారు నిరాశ నిస్పృహలలోనికి వెళ్లిపోతుంటారు. నేను ఈ లోకములో దేనిని సాధించలేకుండా, వ్యర్థులముగా ఉన్నాము అని భావిస్తుంటారు. అయితే, మనము దేవుని ఆత్మ మీద ఆధారపడినప్పుడు, మన జీవితములో కార్యములను చేయడానికి ఆయనకు మనము అనుమతిని ఇచ్చినప్పుడు, మన యందు నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుని మనము ఘనపరచినప్పుడు, ప్రభువు మనలను ఘనపరుస్తాడు. కనుకనే, నా ప్రియులారా, ఎన్నడును నిరాశ చెందకండి.ఈ లోకములో మన జీవితములో అనేక శ్రమలు ఎదురవుతూ ఉండవచ్చును. అయితే, దేవుడు ఇదివరకే జయించియున్నాడు. ప్రభువు సాతానును జయించియున్నాడు. ఈ పాప పూరితమైన మానవాళిని ప్రభువు జయించియున్నాడు. దేవుని ఆత్మ మూలముగా మనము అత్యధికముగా విజయమునొందినవారముగా ఉంటాము. కనుకనే, నా ప్రియులారా, మీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. దేవుని ఆత్మ మూలముగా మీరు ఈ లోకమును జయించగలుగుతారు.
నా ప్రియులారా, యేసు, 'నేను ఉన్నలాగున మీరు కూడా ఈ లోకములో ఉంటారు' అని సెలవిచ్చినట్లుగానే, మీరు అపవాదిపైన శక్తిని మరియు అధికారమును కలిగియుంటారు. సాతానుని యొక్క శక్తి పరిమితి చెందినది. వాని యొక్క జీవితము అశశ్వాతమైనది. ఆఖరి దినమున అపవాది నరకములోనికి త్రోసివేయబడతాడు. సాతాను ఓడిపోతుంది. అందుకనే, ఎన్నడును సాతానుని యొక్క బలమును చూడకండి. సాతాను ఒక ఓడిపోయినటువంటి వ్యక్తి. అయితే, మన యేసయ్య, నిరంతరము నివసించు దేవుడు. ఆయన రాజుల రాజై ఉంటున్నాడు. ఆయన అపవాదికంటె ఎంతగానో శక్తిమంతుడు. కాబట్టి, యేసయ్య నొద్దకు రండి, ఆయనను అంగీకరించి, పరిశుద్ధాత్మడు మీలోనికి వచ్చునట్లుగా, ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, నిశ్చయముగా, ఆయన మీలోనికి వచ్చి, మీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు.
అవును, నా ప్రియులారా, మీరు ఈరోజే యేసు వద్దకు రండి. ఆయనను మీ హృదయంలోనికి అంగీకరించి, తన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపమని ఆయనను అడగండి. ఆయన తన శక్తితో, ప్రేమతో, జ్ఞానంతో, మరియు యథార్థమైన హృదయముతోను మిమ్మల్ని నింపుతాడు. ఆయన మీ జీవితములో మీకు విజయమును అనుగ్రహిస్తాడు. అప్పుడు మీలో ఉన్న ప్రతి నిరుత్సాహము మరియు నిస్పృహ మీ నుండి తొలగించి, మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు, మరియు మిమ్మల్ని విజయవంతులనుగా, గొప్పవారిగా చేస్తాడు. అయితే, ప్రజలను మోసగించడానికి, నిరుత్సాహపరచడానికి, మరియు అణచివేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ యేసు మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఆయన మిమ్మల్ని శక్తివంతమైన నాయకులనుగాను మరియు దేవునికి నమ్మకమైన సేవకులనుగాను ఉన్నత స్థితికి తీసుకురాగలడు, తద్వారా మీరు అనేకుల జీవితములలోనికి ఆయన జరిగించు అద్భుతాలను తీసుకొనివస్తారు. మీలో ఉన్న ప్రభువు ప్రతి నిరాశను తొలగిస్తాడు, మీ యొక్క ప్రతి బాధను స్వస్థపరుస్తాడు, ప్రతి అసమతుల్యతను సరిచేస్తాడు మరియు ఆయన తన పునరుత్థాన శక్తితో మిమ్మల్ని పూర్తిగా పునరుద్ధరిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించునట్లుగా చేస్తాడు, ఆయన శక్తి మీ జీవితంలో ప్రత్యక్షపరుస్తాడు మరియు మీరు ప్రతిరోజు ఆయన జ్ఞానమును, శ్రేయస్సును, రక్షణను, మరియు విజయాన్ని అనుభవించునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, నీవు ఎంత గొప్పవాడవు అని మేము ఈ రోజు చూచియున్నాము. దేవా, ఈ లోకములో ఉన్న అపవాదికంటె మాలో ఉన్న నీవు గొప్పవాడవు, నీవు సర్వశక్తిమంతుడవు. దేవా, అద్భుతములు చేయకుండా నీ హస్తములు మాపట్ల కురచకాకుండా మా మీద ఎల్లప్పుడు ఉండునట్లుగా చేయుము. ప్రభువా మా హృదయములోనికి రమ్ము, నీ శక్తితో, ప్రేమతో, స్థిరమైన మనస్సుతోను, నీ యొక్క జ్ఞానముతో మమ్మును నింపి, మా జీవితములో మాకు విజయమును అనుగ్రహించుము. ప్రభువా, సమస్త మానవాళికంటె నీ బిడ్డలైన మమ్మును తల ఎత్తుకొని చేయునట్లుగా కృపను చూపుము. దేవా, నీవు ఈ లోకములో ఉన్నవానికంటె మాలో ఉన్న నీవు గొప్పవాడవని మేము నమ్మునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క శక్తితో మమ్మును పైకి లేవనెత్తుము. యేసయ్యా, మేము ఎదుర్కొంటున్న నిరాశ, నిస్పృహలన్నిటిని మా నుండి తొలగించి, మమ్మును విజయవంతులనుగా మార్చుము. ప్రభువా, మా జీవితములో ఉన్న అసమతుల్యతలన్నిటిని తొలగించుము. యేసయ్యా, మమ్మును తాకి స్వస్థపరచుము. దేవా, అణిచివేతకు గురియగుచున్న మమ్మును నీ శక్తితో పునర్థురించుము. యేసయ్యా, నీ వెలుగు మా మీద ప్రకాశించునట్లుగా, మేము నీ సేవలో శక్తివంతులముగా వాడబడునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో నీ శక్తిని కనుపరచుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


