నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 2:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను'' ప్రకారము పొలములో ఉంటున్నటువంటి గొఱ్ఱెల కాపరులతో దేవదూత చెప్పిన మాటలు ఇవి. అవును, మొదటిగా రాజుల యొద్దకు దూతలు వెళ్లలేదు కానీ, ఎంతో దీనులైన గొఱ్ఱెల కాపరుల యొద్దకు మొదట వెళ్లారు. ఆ కాపరులు ఎలా భావించారో ఊహించుకొనండి. వారు ప్రశాంతంగా తమ గొఱ్ఱెలతో అక్కడ పండుకొని ఉండవచ్చును. ఆకస్మాత్తుగా దేవదూత కనిపించగానే, వారు ఎంతగానో భయపడి ఉండవచ్చును. కానీ, వారిని చూచి, "అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను'' అని చెప్పినప్పుడు వారు అత్యానందభరితులై ఉండియుండవచ్చును కదా!
నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఆలాగుననే భావించుచున్నారేమో? అందరిలో నేను ఒక వ్యక్తిని అని అనుకుంటున్నారేమో? మిమ్మును ఎవరు పట్టించుకోలేదనియు, మీ పనిని మీరు చేసుకుంటూ ఉండవచ్చును. కానీ, తన వాగ్దానమును మోయుటకు ప్రభువు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆకస్మాత్తుగా దూత వచ్చి, కాపరులను ఆశీర్వదించినట్లుగానే, ఈ రోజు మీ ఆశీర్వాదపు దినమై యున్నది. అందరు మిమ్మును విడిచిపెట్టినట్లుగా మీకు అనిపించుచున్నదా? మీ పైననున్న వారు, మీ ప్రక్కన ఉన్నవారు మిమ్మును పట్టించుకోవడం లేదా? అయితే, నేడు ప్రభువు మిమ్మును ఆశీర్వాదిస్తాను అని అంటున్నాడు. ఆ తర్వాత కాపరులు ఏమి చేశారని మీకు తెలుసా? వారు బాలుడుగా పుట్టిన యేసును చూడడానికి పరుగెత్తుకొని వెళ్లారు. యేసుక్రీస్తును చూచిన వెంటనే వారు సంతోషభరితులయ్యారు. అక్కడితో వారు ఆగిపోలేదు. వారు వెళ్లి, యేసును గురించి ఇతరులతో ఆ సువార్తమానమును తెలియజేశారు. అందుకే బైబిల్ నుండి లూకా 2:17వ వచనములో చూచినట్లయితే, " వారు చూచి, యా శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి'' ప్రకారము వారు వెళ్లి ఈ యొక్క శుభవర్తమానమును అందరితో చెప్పారు. ఈ రోజు అదే ఆశీర్వాదము మీ మీదికి దిగిరానై యున్నది. యేసు ప్రభువు తన సంతోషముతో మిమ్మును నింపనైయున్నాడు. మీరు సంతోషభరితులైనప్పుడు, మిమ్మును మీరే అదుపు చేసుకోలేరు. యేసయ్య, మా జీవితములో ఈ అద్భుతమును చేశాడు అని గంతులు వేస్తారు. కనుకనే, మీరు కూడా ఈ అద్భుతమైన ప్రేమను రుచి చూడాలంటూ, మీరే వెళ్లి అందరితో చెబుతారు.
నా ప్రియులారా, ఈ రోజు మీ జీవితములో జరుగబోయే ఒక చిన్న విషయమై యుండవచ్చును. కానీ, మీ జీవితానికి మరియు ఇతరుల జీవితానికి ఒక గొప్ప వ్యత్యాసమును తీసుకొని రానై యున్నది, ఒక రోజు క్యేటి తెల్లవారు జామున లేవగానే, తన మంచము పై నుండి క్రింది దిగి ప్రక్కన కూర్చున్నది. మా పెంపుడు కుక్కయైన కాఫీ, పరుగెత్తుకొని వచ్చి, తన తలను క్యేటి ఒడిలో పెట్టెను. అది చిన్న విషయమే కావచ్చును. కానీ, అది చూచి, తాను ఎంతగానో సంతోషించినది. అంతమాత్రముతో తను ఆగిపోలేదు, ' అమ్మా , చూడు, కాఫీ ఏమి చేస్తున్నదో, చక్కగా వచ్చి, తన తలను నా ఒడిలో పెట్టినది ' అని సంతోషముతో చెప్పినది. వెంటనే, తను వెళ్లి, నా భర్తయైన శ్యామ్‌కి మరియు మా మామయ్యకు మరియు అత్తయ్య దగ్గరకు వెళ్లి, 'చూడు కాఫీ ఈలాగున చేసింది' అని చెప్పెను. అదేవిధంగా, నా ప్రియులారా, నేడు మీ జీవితములో ఒక చిన్న విషయమే జరుగుతూ ఉండవచ్చును. మీరు ఎంతో కాలముగా వేచియున్న చిన్న ఆశీర్వాదమే అయి ఉండవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, అది ఈ రోజు మీ జీవితాన్ని మార్చబోవుచున్నది. కాబట్టి, ఇట్టి ఆశీర్వాదమును మీరు పొందుకొనండి. ఇట్టి ఆశీర్వాదము కొరకు మనమందరము కలిసి ప్రార్థిద్దాము. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదమును పొందుకుందాము. దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలైన మా జీవితాలను మార్చబోవుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ దీవెనల కొరకై మేము వేచియున్నాము, గర్భఫలము కొరకును, సరైన ఉద్యోగము కొరకును, వివాహము కొరకు మరియు మా జీవితములో అద్భుతములను జరిగిస్తావనియు, ఇంకను మరి ఎన్నో కార్యముల కొరకు వేచియున్నాము. దేవా, ఈ రోజు మా జీవితములో ఒక అద్నుతమును జరిగించుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములు ఈ రోజు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మా జీవితాలను ఈ రోజు మారిపోవునట్లుగా చేయుము. ప్రభువా, మేము సంతోషభరితులగునట్లుగా చేయుము. ప్రభువా, ఆ కాపరుల వలె మేము కూడా వెళ్లి, ఇతరులందరితో నీవు మా పట్ల జరిగించిన అద్భుత కార్యములను బట్టి, అవి చిన్నవైనను సరే, వాటిని చెప్పుకొను కృపను అనుగ్రహించుము. దేవా, దీనులకు, స్వాతికులకు నీ కృపను అనుగ్రహించినందుకు మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, మేము ప్రజలచే కనిపించనట్లు లేదా నిర్లక్ష్యం చేయబడినట్లు అనిపించినప్పటికిని, నీవు మా పేరును గుర్తెరిగియున్నావనియు మరియు మా హృదయాన్ని చూస్తున్నావనియు తెలుసుకోవడంలో మేము ఇప్పటికిని ఆనందించుచున్నాము. ప్రభువా, ఈ రోజు మమ్మును ఏ పరిస్థితి కూడా ఆకర్షించలేని నీ సమాధానముతో నింపుము. దేవా, నీ మంచితనాన్ని ఇతరులతో పంచుకునేలా నీ ఆనందం మాలో పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, చిన్న, చిన్న ఆశీర్వాదాలు కూడా నీ బలమైన హస్తాలలో గొప్ప ఉద్దేశ్యాలను కలిగియున్నాయని నమ్మడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, నీవు మాకు సమీపముగా ఉన్నావనియు మరియు మమ్మును అతీంద్రియంగా ఆశీర్వదించబోతున్నావనియు పరిపూర్ణంగా నమ్ముటకును, మేము ఈ రోజు నీ వాగ్దానమును విశ్వాసం మరియు కృతజ్ఞతతో అంగీకరించునట్లుగా చేయుమని ఈ ఆశీర్వాదమును యేసు నామమున పొందుకొనుటకు మాకు నీ కృపను నిచ్చి, మమ్మును దీవించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


