నా ప్రియమైన స్నేహితులారా, మనలను గొప్ప చేయుట కొరకే దేవుడు ఈ రోజు మన మధ్యకు దిగివచ్చియున్నాడు. ఎందుకనగా, మనము ఆయన బిడ్డలమై యున్నాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 92:10వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము నుండి ఆయన స్వరమును మనము ఆలకించుదాము. ఆ వచనములో, "గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని'' అని చెప్పబడినట్లుగానే, గురుపోతు కొమ్మువలె దేవుడు మీ కొమ్మును పైకెత్తవలెనని మీ పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, కీర్తనలు 92వ అధ్యాయమును మీరు చూచినట్లయితే, కీర్తనాకారుడైన దావీదు గొప్ప శత్రుత్వమును ఎదుర్కొంటు న్న సందర్భములో ఈ అధ్యాయము వ్రాయబడినది. దావీదును వేదించి, పీడించుచూ, గొప్ప కష్టములను కలిగించుచున్న ప్రజల మధ్యలో అతడు జీవించి ఉండియున్నాడు. అప్పుడు దావీదు, 'ప్రభువా, ఇటువంటి స్థితిగతుల మధ్యలో కూడా, నీవు నన్ను హెచ్చించియున్నావు, ఈ శ్రేష్టమైన తైలమును నీవు నా మీద కుమ్మరించియున్నావు. నీవు నన్ను గొప్ప చేసియున్నావు, నీవు నాకు వృద్ధి కలుగజేసియున్నావు, దేవుని బిడ్డగాను, శక్తివంతమైనవానిగా నీవు నన్ను చూపించియున్నావు' అని అంటున్నాడు. ఈలాగుననే ఆయన మిమ్మును కూడా వృద్ధిని కలుగజేస్తాడు.
ఈలాగుననే, నా ప్రియులారా, ప్రభువు మీకు కూడా చేయగోరుచున్నాడు. ఒకవేళ మీరు ప్రజల చేత పీడింపబడుచూ, వేదించబడుచున్నారేమో? నా స్నేహితులారా మీరు గొప్ప అవమానముగుండా వెళ్లియున్నారేమో? లేక ప్రభువు నిమిత్తము దీనిని కూడా సహించవలసియున్నదేమో? మీరు ఆలాగుననే చేసియున్నారేమో? ఇప్పుడు ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ' నా బిడ్డలారా, ఇప్పుడు, ఇది నేను మిమ్మును హెచ్చించు సమయము, ఎందుకనగా, వారు నా కోసమై సహనముతో ఉండియున్నారు, ఇప్పుడు నా హస్తము వారి మీదికి దిగివచ్చు సమయము ఆసన్నమైనది. వారిని హెచ్చించవలసియున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:5వ వ వచనములో చూచినట్లయితే, "నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, తన శత్రువుల యెదుట దేవుడు దావీదునకు ఒక బల్లను సిద్ధపరచియున్నాడు. ఆలాగుననే, దేవుడు మిమ్మును కూడా వ్యతిరేకించిన వారి సమక్షంలో కూడా ప్రభువు మిమ్మును హెచ్చిస్తాడు.
బైబిల్‌లో మొర్దెకైకు ఆలాగుననే జరిగియున్నది. హామాను అనే వ్యక్తి ద్వారా ఒక పరిస్థితి కల్పించబడియున్నప్పుడు, అతడు రాజుగారి దర్భారులో చాలా పెద్ధ అధికారిగా ఉన్నాడు. మొర్దెకై ప్రజలైన యూదులందరిని చంపివేయులాగున అతడు రాజును కదిలించగలిగియున్నాడు. కానీ, వీటన్నిటి మధ్యలో కూడా మొర్దెకై ప్రార్థనలో పోరాడియున్నాడు. తనకు పినతండ్రిగా ఉంటూ, తన కుమార్తెయైన ఎస్తేరును కూడా ఆలాగున ప్రార్థించమని కోరియున్నాడు. వారు తన ప్రజలను రక్షించడానికి నిరంతరాయముగా దేవుని శక్తి మీద నమ్మిక ఉంచియున్నారు.
ఏమి జరిగింది? దేవుడు ఆ స్థితిని తలక్రిందులుగా మార్చివేసియున్నాడు. హామాను సంకల్పించిన మరణకరమైన మొర్దెకైకు విరుద్ధమైన ప్రణాళిక అంతయు కూడా, అది హామాను మీదికి తిరిగి వచ్చి పడిపోయినది. మొర్దెకై కొరకు సిద్ధపరచిన ఉరి కంబము మీద హామాను వ్రేలాడ దీయబడునట్లుగా రాజు చేసియున్నాడు. దర్భారులో హామానుకు ప్రతిగా మొర్దెకైకు గొప్ప ఔన్నత్యమును అనుగ్రహించాడు. ఎంత గొప్ప మార్పు జరిగినది కదా? అదేవిధంగా, దేవుడు మీ ప్రజల ఎదుట మరియు మీ శత్రువుల ఎదుట కూడా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభువు నుండి మనము దీనిని పొందుకుందామా?
నా ప్రియులారా, దేవుడు మీకు ఆలాగున మీ శ్రతువుల యెదుట భోజనపు బల్లను సిద్ధపరుస్తాడు. ప్రజల అందరి యెదుట మీకు గొప్ప ఔన్నత్యమును అనుగ్రహిస్తాడు. మనము దేవుని యొద్ద నుండి ఇటువంటి ఔన్నత్యమును స్వీకరించుదామా? నా ప్రియ స్నేహితులారా, హెచ్చించబడు సమయము మీ యొద్దకు వచ్చియున్నది. కనుకనే, దేవునికి మహిమను చెల్లించండి. ఈ రోజు, ప్రభువు మిమ్మును మరియు మీ కుటుంబమును హెచ్చించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఆయన మిమ్మును మాత్రమే కాకుండా, మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. మీ పిల్లలు అభివృద్ధి పొందింపజేస్తాడు; వారు తమ చదువులలో ఉన్నత స్థానమును పొందుకుంటారు. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు హెచ్చింపరచబడతారు; ప్రభువు వారిపై తన అభిషేక తైలమును కుమ్మరించి, వారిని శక్తివంతంగా వాడుకుంటాడు. ప్రభువు మిమ్మును అభివృద్ధి చేసి, తన బిడ్డగా నిలబెడతాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవిస్తాడు.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, నీ కనుదృష్టిని మా మీద ఉంచి, మా మీద దయగల దేవునిగా నీవు ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, మేము నీ నిమిత్తము ఎంతగానో బాధను మరియు శ్రమలను సహించియున్నాము. కనుకనే, మమ్మును జ్ఞాపకము చేసుకొనము. దేవా, మా శత్రువులు కలిగించు సమస్యల మధ్యలో మరియు సమస్యాత్మకమైన పరిస్థితుల మధ్యలో మమ్మును హెచ్చించు నిమిత్తము నీ యొక్క హస్తము మా మీదికి వచ్చి, మమ్మును హెచ్చించుము మరియు నీవు మా శత్రువుల యెదుట మాకు భోజనమును సిద్ధపరచుము. దేవా, మా కుటుంబములోను, మా బిడ్డలకు నీ ఔన్నత్యము దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా శత్రువుల యెదుట మమ్మును హెచ్చించి, మరియు మా ప్రతి పరిస్థితిని మా మేలు కొరకు మార్చుము. దేవా, మా పిల్లల చదువులలో ఆశీర్వదించు మరియు మా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి అభివృద్ధిని కలుగజేయుము. ప్రభువా, నీ అభిషేక తైలమును మా మీద కుమ్మరించి, నీ మహిమ కొరకు మమ్మును శక్తివంతంగా ఉపయోగించి, మమ్మును వృద్ధి చేసి, నీ పిల్లలుగా స్థిరపరచుము, ఇది మాకు దైవీక ఉన్నత సమయముగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


