నా ప్రియ స్నేహితులారా, దేవుడు నేడు మీ పాపములన్నిటిని క్షమించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. మీరు దేవుని యెదుట మరియు మానవుల యెదుట లోపరహితముగా మరియు పరిశుద్ధంగా జీవించాలని ప్రభువు మీ పట్ల వాంఛకలిగియున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 10:43వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన యందు విశ్వాసముంచు వాడెవడోవాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందుదురు...'' అని చెప్పబడియున్నట్లుగానే, మనము ఆయనయందు విశ్వాసముంచినప్పుడు, మనము పాపక్షమాపణను పొందుకుంటాము. అవును, యేసు సిలువకు అప్పగించినప్పుడు, బైబిల్ నుండి లూకా 23:42వవచనములో చూచినట్లయితే, యేసు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగ, ఆయనను చూచి, "యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము'' అని చెప్పెను. ఆలాగుననే, లూకా సువార్త 23:43వవచనములో చూచినట్లయితే, యేసయ్య ప్రక్కనే మేకులతో కొట్టబడియున్న ఆ దొంగను చూచి, ఆయన ఈలాగున అంటున్నాడు, "అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పు చున్నాననెను.'' ఆయన ఆ రీతిగా ఆ దొంగతో సెలవిచ్చియున్నాడు. ఆలాగుననే, ఆయన అందరి కొరకు మొఱ్ఱపెట్టియున్నాడు. అయితే, వారేమో, ఆయన రక్తము చిందించబడుట కొరకు కేకలు వేయుచున్నారు. కానీ, ఆయన ఇలాగున అంటున్నాడు, "అందుకు యేసు, తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము, వీరు నన్ను సిలువ వేసియున్నారు, వారు నన్ను మేకులు కొట్టియున్నారు, నా మీద అన్యాయము గా నిందారోపణలు మోపి, వారు నన్ను సిలువకు మేకులతో కొట్టియున్నారు. అయినప్పటికిని వారి క్షమాపణ కొరకు ప్రార్థించుచున్నాను. తండ్రీ, వారిని క్షమించుము, వారేమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుకనే, వారిని క్షమించుమని'' పలికెను. అవును, నా ప్రియులారా, ఆయన సిలువను అధిగమించియున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మరణమును కూడా జయించియున్నాడు. ఆయన యొక్క క్షమాపణ ద్వారా, ఇంకను ఆయన క్షమించియుండగా, దేవుడు ఆయనను మృత్యువులో నుండి పైకి లేపియున్నాడు.
నా ప్రియులారా, నేడు మీరు కూడా ఆలాగుననే పైకి లేవనెత్తబడుదురు. ప్రజలందరి కొరకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా, మీరు మీ జీవితమును యేసునకు సమర్పించినట్లయితే, మీరు పైకి లేవనెత్తబడుదురు. రెండవదిగా, అది మీకు శాంతి సమాధానమును తీసుకొని వచ్చును గాక. అందుకే బైబిల్ నుండి లూకా సువార్త 7:50వ వచనములో మనము చూచినట్లయితే, ఆమె అత్యంత ఖరీదైన అత్తరుతో ఆయనను అభిషేకించియున్నది. ఇంకను, ఆయన పాదములను తన కన్నీటితో కడిగెను. ఆ సమయములో ఆయన, ఆమెను చూచి, "అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.'' తద్వారా, ఆ స్త్రీ తన పాపము నుండి విడిపించబడియున్నది. అదేవిధముగా, మీ పాపము మరియు శాపము నుండి ఆమె స్వస్థపరచబడియున్నది. మరియు మూడవదిగా, బైబిల్ నుండి మత్తయి సువార్త 9:6వ వచనములో చూచినట్లయితే, పక్షవాయువుగలవాని వైపు చూచి, "కుమారుడా, ధైర్యము తెచ్చుకొనుము, నీ పాపములు క్షమించబడియున్నవనియు, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారముకలదని మీరు తెలిసికొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువుగలవానితో- నీవు లేచి, నీ మంచము ఎత్తికొని నీ ఇంటికి వెళ్లుము అని చెప్పెను.'' ఆ వ్యక్తి వెనువెంటనే, స్వస్థపరచబడియున్నాడు. క్షమాగుణం ఆత్మను పవిత్రపరచడమే కాకుండా, మన జీవితములలో స్వస్థతను, పునరుద్ధరణను మరియు సమాధానమును కూడా మనకు కలుగజేయుచున్నది.
అందుకే బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 7:14వ వచనములో చూచినట్లయితే, "నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ప్రజలు ప్రార్థన చేసినప్పుడు, దేశమును బాగుచేయుచున్నాడు. నా ప్రియులారా, ఈ రోజు దేవుడు మీకు ఇట్టి ఆశీర్వాదములను అనుగ్రహించుచున్నాడు. ఆయన మిమ్మును స్వస్థపరచవలెననియు, మీ పాప శాపములను స్వస్థపరచవలెనని, ఆయన మీ దేశమును బాగుచేయవలెననియు మరియు మీకు గొప్ప ప్రతిఫలము వచ్చునట్లుగా మీ భూభాగమును బాగుచేయుచున్నాడు. ఈనాడు మీరు ఎంతో కృంగిపోయినట్లుగాను, భారంతో సతమతమవుతున్నట్లుగానో భావించినప్పటికిని, యేసు తన యొద్దకు రమ్మని మిమ్మును ఆహ్వానించుచు న్నాడు. తన క్షమాపణ ద్వారా, ఆయన మిమ్మును లేవనెత్తుతాడు, మీ హృదయమును శాంతి సమాధానములతో నింపుతాడు. ఇంకను, మీ జీవితమును పూర్తిగా స్వస్థపరుస్తాడు మరియు అనేకమందికి ఆశీర్వాదంగా మిమ్మును మారుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ గొప్ప ప్రేమ మరియు కనికరము ద్వారా మమ్మును క్షమించినందుకు నీకు వందములు. ప్రియమైన ప్రభువా, మా పాపములన్నిటితో, భారములతో మరియు బలహీనతలతో నీ సన్నిధికి వచ్చుచున్నాము. దేవా, మేము నీకు మొఱ్ఱపెట్టకమునుపే నీవు మాకు జవాబును దయచేయుము. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదములను ప్రవాహమువలె మాలోనికి ప్రవహించునట్లుగా చేయుము. యేసయ్యా, మాలోనికి నీ యొక్క సమాధానము వచ్చుటకును, గొప్ప వనరులు వచ్చుటకును, దైవీకమైన అవగాహన, వర్థిల్లత వెంబడి వర్థిలతను యేసు నామమున మాకు దయచేయుము. దేవా, మా హృదయాన్ని కడిగి, దేవుని మరియు మనుష్యుల యెదుట మమ్మును పరిశుద్ధునిగా చేయుము. యేసయ్య, నీ యొక్క శాంతితో మమ్మును నింపి, మా జీవితం నుండి ప్రతి అపరాధ భావనను మరియు అవమానమును తొలగించుము. దేవా, మాలో పాపం వలన కలిగిన ప్రతి గాయమును స్వస్థపరచి, మా ఆత్మను సంపూర్ణంగా పునరుద్ధరించుము. ప్రభువా, ప్రతిరోజు మా జీవితమును సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ క్షమాపణ మా హృదయములో స్వస్థతను, ఆనందమును మరియు విడుదలను తీసుకువచ్చునట్లుగా కృపనిమ్ము. ప్రభువా, మా జీవితమును వృద్ధిలోనికి తీసుకువచ్చి, ఇతరులకు మమ్మును ఆశీర్వాదకరముగా చేయుము. దేవా, నీ పేరు పెట్టబడినవారినిగా మమ్మును మార్చి, మమ్మును మేము తగ్గించుకొని ప్రార్థన చేయుచూ, నిన్ను వెదకుచూ, మా చెడు మార్గములను విడుచునట్లుగా చేయుము. దేవా, మా ప్రార్థనను విని, మా పాపములను క్షమించి, మా దేశమును స్వస్థపరచుమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


