నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 రాజులు 9:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను'' ప్రకారము దేవుని చూడటం, ఆయన మాట్లాడటం వినడం ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ప్రభువు రెండవమారు సొలొమోనుకు ప్రత్యక్షమాయెను, "నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని'' అని ప్రభువు చెప్పియున్నాడు. ప్రభువును చూడడము, ఆయన మాట్లాడినట్లయితే వినడం ఎంత సంతోషకరమైన విషయమో కదా! అయితే, సొలొమోనుకు ప్రభువు రెండుసార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు ఇశ్రాయేలీయుల ప్రజల యందు ఎంత ఇష్టమును కలిగియున్నాడు అని దీని వలన మనము తెలుసుకొనగలము. ప్రభువు దావీదు సంతానమును ఎంతగానో ప్రేమించియున్నాడు. రాజైన సొలొమోనుకు ప్రభువు మొదటగా ప్రత్యక్షమైనప్పుడు, ఐశ్వర్యమును కోరుకొనలేదు గానీ, దేవుని యొక్క జ్ఞానమును అతడు కోరుకొనియున్నాడు. ఆలాగుననే, రెండవసారి, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, మందిరమును దీవించమని అతడు ఈలాగున కోరుకున్నాడు, ' ప్రభువా, ఈ స్థలమందు, మందిరమందు చేయబడు ప్రార్థనలన్నియు కూడా నీవు దృష్టించి, ఆలకించుము అని ప్రార్థించాడు.' ప్రభువు అతని ప్రార్థన యందు ఎంతగానో ఇష్టపడ్డాడు. కనుకనే, మనము అడుగువాటన్నిటిని కంటెను మరియు ఊహించువాటన్నిటికంటె అత్యధికముగా అనుగ్రహించు దేవుడు మన యేసయ్య. కనుకనే, తన కళ్లను, తన చెవులను ఆ మందిరమందు ఉంచమని అడిగాడు సొలొమోను. అందుకు ప్రభువు, 'నా దృష్టియు, నా మనస్సును, ఎల్లప్పుడు ఆ మందిరమందు ఉండునని ప్రభువు అతనికి వాగ్దానము ఇచ్చియున్నాడు. నా హృదయము ఎల్లప్పుడు అక్కడ ఉంటుంది.' అనగా, ఎల్లప్పుడు అక్కడికి వచ్చు ప్రజలు దేవుని యొక్క సన్నిధానమును అనుభూతి చెందాలని ప్రభువు వారి పట్ల కోరుకున్నాడు. చూడండి, మనము ఎంత ప్రేమగల దేవునిని కలిగియున్నాము కదా!

అదేవిధముగానే, బైబిల్ నుండి 2 రాజులు 20:3వ వచనములో చూచినట్లయితే, రాజైన హిజ్కియా ఇలాగున ప్రభువునకు ప్రార్థించెను, 'యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.' అందుకు 2 రాజులు 20:5వ వచనములో చూచినట్లయితే, యెహోవా దేవుడు, "నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కి పోవుదువు'' అని ప్రభువు సెలవిచ్చెను. ఆలాగుననే, హన్నా దేవుని మందిరములో ప్రార్థించినప్పుడు, ప్రభువు ఆమె యొక్క మొఱ్ఱను ఆలకించియున్నాడు. హన్నా తన కొరకు మాత్రమే ఒక బిడ్డను ప్రభువును అడగలేదు గానీ, "సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన యెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను'' ప్రకారము అటువంటి ప్రార్థన ప్రభువుకు ఎంతో ఇష్టమైనది. ఒకసారి మేమందరము కుటుంబముగా కలిసి డా. డి.జి.యస్. దినకరన్‌గారి కొరకు ప్రార్థించియున్నాము. మా తండ్రిగారు అనారోగ్యముగా ఉన్న సమయములో, మా తండ్రిగారు ఆయన మీద మా అందరి చేతులు ఉంచి ప్రార్థించమని కోరారు. నేను ప్రార్థించే సమయము వచ్చినప్పుడు, నా చేతులు మా తండ్రిగారి మీద ఉంచి, ' ప్రభువా, మా తండ్రిగారికి మంచి ఆరోగ్యమును దయచేయుము అని ప్రార్థించాను.' ఆలాగుననే, 'ఆయన ప్రార్థించినప్పుడు, ఇంకను అనేకులు స్వస్థపరచబడునట్లుగా, తండ్రీ, నీవు ఈయనను స్వస్థపరచుము' అని నేను అడిగాను. 'ఆయన దీర్ఘకాలము జీవించినట్లయితే, అనేకులకు దీవెనకరముగా ఉంటారు ' అని నాలో నేను ఆలాగున ప్రార్థన చేయుచున్నప్పుడు, నేను ఆ ప్రార్థనను అడుగుతూ, ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువు నన్ను తన పరిశుద్ధాత్మతో నింపినందున, నేను ఆనందముతో నవ్వుచున్నాను. ఆ సమయములో ప్రభువు నా ప్రార్థన యందు ఇష్టపడియున్నాడని అప్పుడు నాకు అర్థమైనది. ప్రార్థనా అనంతరము నేను తండ్రిగారితో ఈలాగున చెప్పాను. దైవజనులైన మీ కొరకు నేను ప్రార్థన చేయుచుండగా, మీ మీద దేవుడు ఉంచిన కృప నా మీదికి దిగివచ్చినది అని చెప్పాను. ఆ దినమున ప్రభువు నిశ్చయముగా దేవుని యొక్క నూతనమైన కృపలను నాకు అనుగ్రహించియున్నాడని నేను ఎరుగుదును.

నా ప్రియ స్నేహితులారా, మన ప్రార్థనలన్నిటిని ఆలకించి మరియు మనము అడుగువాటన్నిటినికంటె అధికముగా అనుగ్రహించే దేవుడై యున్నాడు. మన ప్రార్థనలన్నియు ఏవియు కూడా వృధా కావు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 56:8వ వచనములో చూచినట్లయితే, " నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా'' అని చెప్పబడినట్లుగానే ప్రకారము మన కన్నీళ్లన్నిటిని కూడా ఆయన తన బుడ్డిలో ఉంచుకుంటాడు. మనము చేయుచున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు భద్రపరచియుంటాడు. మన కన్నీళ్లన్నిటిని కూడా ఆయన తన కవిలెలలో దాచిపెడతాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 34:15వ వచనములో చూచినట్లయితే, " యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి '' అని చెప్పబడిన ప్రకారము మనము దేవునికి ప్రార్థన చేయడానికి ఒక మందిరానికి మాత్రమే వెళ్లవలసిన అవసరము లేదు. దేవుని మందిరమైనటువంటి యేసయ్యను మనము ఎల్లప్పుడును మనతో కలిగియున్నాము. యేసయ్య మన హృదయములోనే ఉన్నాడు. ఏ సమయములోనైను, ఎక్కడనుండియైనను మనము దేవునికి ప్రార్థన చేయవచ్చును. యేసయ్యతో మనము ఎల్లప్పుడు మాట్లాడుతూ ఉండవచ్చును. మన దేవుడు మనము చేయుచున్న ప్రతి ప్రార్థనలను ఆలకించువాడైయున్నాడు. కొన్నిసార్లు 'మన ప్రార్థనలను దేవుడు వినడము లేదు ' అని మనము భావిస్తాము. అయితే, ప్రభువు యొద్ద నుండి జవాబును పొందుకొను వరకు మనలను వేచియుండునట్లుగా చేస్తాడు. అప్పుడు మాత్రమే ప్రభువు మనకు ఇచ్చే ఆశీర్వాదములను ఎంతో విలువైన వాటినిగా మనము చూడగలుగుతాము. ఇది నా జీవితములో అనేకసార్లు నేను ఎంతగానో అనుభూతి చెందాను. కనుకనే, నా ప్రియులారా, దేవుని కొరకు మీరు వేచియుండండి. ఆవేశపడకండి, ప్రభువును అడుగుతూనే ఉండండి, దేవుని యొక్క తలుపులను ఎల్లప్పుడు తడుతూనే ఉండండి, దేవుడు మీ ప్రార్థనలను ఆలకించుచున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీతో కూడా అదే చెబుతున్నాడు, 'మీ ప్రార్థనలన్నిటిని నేను ఆలకించియున్నాను, నా సన్నిధిలో మీరు చేసిన మనవులన్నిటిని నేను అంగీకరించియున్నాను.' ప్రభువు మీ ప్రార్థనలను తప్పకుండా ఆలకిస్తాడు. కనుకనే, మీరు నిరాశచెందకండి, ప్రభువు మీకు ఇంకా అనేకమైన గొప్ప కార్యాలను చేయబోవుచున్నాడు, మరియు వాటన్నిటిని మీకు ఇవ్వబోవుచున్నాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 23:5వ వచనములో చూచినట్లయితే, " నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది'' అని దావీదు భక్తుడు చెప్పబడినట్లుగానే, మీ శత్రువుల యెదుట ఆయన మీకు భోజనమును సిద్ధపరుస్తాడు. అంతమాత్రమే కాదు, మన కొరకు రాబోవుచున్న ఆశీర్వాదములన్నియు ఇదివరకే సిద్ధపరచియున్నాడు. అవును, నా ప్రియులారా, మీ కొరకు ఆశీర్వాదములన్నియు కూడా సిద్ధపరచబడియున్నవి. అవి ఎంతో గొప్పవి. దేవుని మంచితనము మేలులు ఎంతో గొప్పవి అటువంటి దీవెనలను మనము పొందుకొనడానికి మనము వేచియున్నప్పుడు, ఆశీర్వాదముల కొరకు మనము వేచియున్నప్పుడు, అవి మనము పొందుకున్నప్పుడు వాటిని విలువైన వాటినిగా మనము చూడగలుగుతాము. శ్రేష్టమైన విషయాలు మీ యొద్దకు రానై యున్నవి నా ప్రియ స్నేహితులారా, కనుకనే, మీరు నిరాశచెందకుండా, నిత్యము ప్రార్థన చేయండి, ఆయన మీ ప్రార్థనలను ఆలకించి, మీకు జవాబును ఇస్తాడు. నేటి వాగ్దానము నుండి మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రార్థనలను ఆలకించు మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా ప్రార్థనలను వింటున్నావు మరియు మా ప్రతి కన్నీటిని చూస్తున్నావని మాకు తెలియజేసినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు మా కన్నీటితో నిండిన ప్రార్థనలన్నింటిని నీ బుడ్డిలోను, మరియు నీ కవిలెలోను దాచియుంచినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము వేచియున్న మా నిరీక్షణ కాలంలో కూడా, నీవు మా మేలు కొరకు సమస్తమును జరిగిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము ప్రార్థించిన వాటన్నిటికంటె అత్యధికముగా మాకు అనుగ్రహించుము. దేవా, మా శత్రువుల యెదుట నీవు మాకు ఒక విందును ఏర్పాటు చేసి, వారి యెదుట నీ ఆశీర్వాదములను మా మీద కుమ్మరించబడునట్లుగా సహాయము చేయుము. దేవా, మా ప్రార్థనలన్నిటిని ఆలకించి, మాకు తగిన కాలమందు జవాబును దయచేయుము. ప్రభువా, మా మొఱ్ఱలకు జవాబు వచ్చువరకు మేము వేచియుండునట్లుగా దయచేసి మా విశ్వాసమును బలపరచుము. దేవా, మా ప్రార్థనలకు ఇంకా జవాబును పొందుకొనలేదని మేము నిరుత్సాహపడకుండా ఉండటానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీ యొక్క సన్నిధి మా జీవితములో నింపి, నీవు మా కొరకు సిద్ధపరచిన ప్రతి ఆశీర్వాదములను విలువైనదిగా పరిగణించడం మాకు నేర్పుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.